రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన అక్కచెల్లెమ్మలు*వైఎస్సార్ కాపు నేస్తం.. పేద అక్కచెల్లెమ్మలకు ఆపన్న హస్తం*


*: వరుసగా రెండో ఏడాది కూడా వైఎస్సార్ కాపు నేస్తం అమలుతో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల మోముల్లో వెల్లివిరిసిన ఆనందం*


*: రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన అక్కచెల్లెమ్మలు


*


అనంతపురం, జూలై 22 (ప్రజా అమరావతి):


*వైఎస్సార్ కాపు నేస్తం పథకం పేద అక్కచెల్లెమ్మలకు ఆపన్న హస్తం ఇస్తోంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న పేద అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. వరుసగా రెండో ఏడాది కూడా వైఎస్సార్ కాపు నేస్తం అమలుతో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద అక్కచెల్లెమ్మలకు 490.86 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. అనంతపురం జిల్లాలో 9,767 మంది పేద అక్కచెల్లెమ్మలకు 14.65 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా పది వేల రూపాయల చొప్పున ఐదు నెలల్లో మొత్తం 75 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుండటంతో వారంతా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పేద అక్కచెల్లెమ్మలు తమ అభిప్రాయాలను తెలియజేశారు.*


*1. రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు*

*: కళావతి, అశోక్ నగర్, అనంతపురం (జిల్లా).*


కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సహాయం అందించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు వరుసగా రెండో ఏడాది కూడా వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద లబ్ధి కలిగింది. మా అమ్మాయికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. నేను బజ్జీలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున సహాయం చేయడం ఎంతో గొప్ప విషయం. ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కి జీవితాంతం రుణపడి ఉంటాను.


*2. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక సహాయం చేయడం ఎంతో గొప్ప విషయం*

*: రమాదేవి, అశోక్ నగర్, అనంతపురం (జిల్లా).*


నేను పనికి వెళుతూ జీవనోపాధి పొందుతున్నాను. నాకు మొదటిసారి వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద 15 వేల రూపాయల లబ్ధి కలిగింది. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో జీవనోపాధికి ఇబ్బందులు ఎదురవుతున్న వేళ వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద ఆర్థిక సహాయం చేయడం ఎంతో గొప్ప విషయం. నాకు డ్వాక్రా సంఘంలో 10 వేల రూపాయల లబ్ధి పొందాను. పావలా వడ్డీ వచ్చింది. మహిళలకు అన్ని వేళలా తోడుగా ఉంటూ ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


*3. వైఎస్సార్ కాపు నేస్తం పథకం పేద అక్కచెల్లెమ్మలకు వరంలాంటిది*

*: అలివేలమ్మ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, అనంతపురం (జిల్లా).*


వైఎస్సార్ కాపు నేస్తం పథకం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద అక్కచెల్లెమ్మలకు ఓ వరంలాంటిది. నాకు వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద మొదటి, రెండవ సారి 15 వేల రూపాయల చొప్పున లబ్ది కలిగింది. నాకు వితంతు పింఛన్ వస్తోంది. డిగ్రీ చదువుతున్న మా బాబుకు జగనన్న విద్యా దీవెన పథకం కింద లబ్ది కలిగింది. మాకెంతో సంతోషంగా ఉంది. అనేక విధాలుగా పేద మహిళలను ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాము.


*4. వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా మహిళలకు ఆర్థికాభివృద్ధి*

*: పి.ఆదెమ్మ, మరువకొమ్మ కాలనీ, అనంతపురం (జిల్లా).*


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలు చేయడం ద్వారా మహిళలకు ఆర్థికాభివృద్ధి లభిస్తోంది. నేను టైలర్ పని చేస్తున్నాను. నాకు రెండో ఏడాది కూడా కాపు నేస్తం కింద 15 వేల రూపాయల లబ్ది కలిగింది. దీని ద్వారా కరోనా సమయంలో జీవనోపాధికి ఇబ్బంది లేకుండా మాకు ఎంతో మేలు జరిగింది. మా కుమారుడికి వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద లబ్ధి కలిగింది. నిరుపేద మహిళలను ఆదుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రికు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


*5. జగనన్నకు ధన్యవాదాలు*

*: ఎన్. విజయలక్ష్మి, ఓబులదేవరనగర్, అనంతపురం (జిల్లా).*


నాకు మొదటిసారి వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద లబ్ధి కలిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు పింఛన్ కూడా వస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేద మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. Comments