కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

 *కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం


.*


రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.


దివ్యాంగులకు ఉపకరణాలు అందించిన మంత్రి.


అందరికి పెద్దన్న జగనన్న ఉన్నారు. మీరు మనో ధైర్యం తో ఉండండి.


పలాస : జులై 17 (ప్రజా అమరావతి):


ప్రజల కష్టాలను గుర్తెరిగి వారిని ఆదుకోవడమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శనివారం పలాస మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దన్న లా అండగా ఉంటారని అన్నారు. అందుకే మీరి మనో ధైర్యంతో ముందుకు పోవాలని కోరారు. దివ్యాంగులలో కూడా ఎంతో ప్రతిభావంతులైన వారు ఉన్నారని అలాంటి వారిని ప్రోత్సహించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విదంగా రాష్ట్రంలో దివ్యాంగుల కోసం ఎన్నో సంక్షేమ పధకాలు ఇస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. పాదయాత్రలో  ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు పించనులు పెంచిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి దని ప్రజలు గమనించాలని కోరారు. కష్డంలో ఉన్న వారిని ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. పక్షవాతం తో బాదపడుతున్న వారికి నెలకు ఐదు వేల రూపాయలు పించను. తలసేమియా, హిమోఫియా వ్యాదితో బాదపడుతున్న వారికి మందుల కోసం నెలకు పది వేల రూపాయలు పించను అందిస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. అలాగే మన ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాది గ్రస్తులను ఆదుకోవడానికి పత్యేక శ్రద్ద తీసుకోవడం జరిగిందని ఒక్కో దశలో ఉన్న వారికి ఒక్కో రకమైన సహాయ సహకాలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఐదు వేలు పించను ఇవ్వడం, డయాలసిస్ చేయించడం, మందులు, ఆసుపత్రికి తీసుకుని వెల్లే సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం చేస్తున్న విషయం గమనించాలని కోరారు. ప్రజల కోసం వందకు వంద శాతం కష్టపడి పని చేసే ప్రభుత్వం మన వైసిపి ప్రభుత్వం అని తెలిపారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏ ఒక్క సంక్షేమ ,అభివృద్ధి పధకాలను ఆపనీయకుండా ప్రజలకు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ లో జగనన్న ప్రభుత్వం అని చెప్పడానికి ఒక మంత్రిగా గర్వ పడుతున్న అని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం మీ వలన దొరికిందని మీకు నిరంతరం సేవ చేస్తూ ముందుకు పోతానని హామీ ఇచ్చారు. దివ్యాంగులకు ప్రభుత్వం నుండి ఉపకరణాలు పొందాలంటే మీ ప్రాంతాలలో ఉన్న సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని వాటిని అధికారులు పరిశీలించిన అనంతరం మీకు ఉపకరణాలు అందిస్తారని ఇది నిరంతర ప్రక్రియ గా కొనసాగుతుందని తెలిపారు. పలాస మండల అభివృద్ధి అధికారి ఎన్. రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం నిర్వహించారు. పలాస మండలానికి సంబందించి దివ్యాంగులకు, వృద్దులకు, విభిన్న ప్రతిభావంతులకు పలు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఎలక్ట్రానిక్ ట్రై సైకిల్స్, స్మార్ట్ చేతి కర్రలు, సెల్ పోన్లు, చెవి వినికిడి మిషన్లు లతో 656 మందికి ఉపకరణాలు అందించారు. గతంలో వికలాంగుల సర్టిఫికేట్ పొందాలంటే ఎంతో ప్రయాశ ఉండేదని కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వికలాంగులకు కష్టం లేకుండా  వికలాంగుల సర్టిఫికేట్లు ప్రతి కమ్యునిటీ హెల్త్‌కేర్ సెంటర్ లలో అందుబాటు లోకి తెచ్చిన ఘనత వైసిపి ప్రభుత్వానిదని అన్నారు. తను మెడిసిన్ చదువుతున్న సమయంలో తోటి విద్యర్ధులతో కలిసి శ్రీ వివేకానంద ఐడియల్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకుని మూడు గ్రామాలను దత్తత తీసుకుని పోలియో వ్యాక్సిన్ వేసే కార్యక్రమంలో ఉత్సహంగా పాల్గొన్న సందర్భం గుర్తు చేశారు. సామాజిక స్పృహ మనకు ఉన్నప్పుడు సమాజం పట్ల మరియ్ బాధ్యత పెరుగుతుందని అన్నారు. ప్రస్తుతం ఎంత మంది దరఖాస్తులు పెట్టారో వారికి ఉపకరణాలు అందించామని మిగతా లబ్ధిదారులకు కూడా ఉపకరణాలు అందిస్తామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇదంతా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు.

 ఈ కార్యక్రమంలో పలాస, మండసా, వజ్రపుకొత్తూరు మండలాల అభివృద్ధి అధికారులు, మండలంలోని దివ్యాంగులు, వైసిపి నాయకులు పలువురు పాల్గొన్నారు.