విద్యకు కొత్త నిర్వచనం చెప్పిన ప్రభుత్వం


 *విద్యకు కొత్త నిర్వచనం చెప్పిన ప్రభుత్వం.* 


 *సంస్కరణలు అమలులో అధికారుల పాత్ర అభినందనీయం.* 

అమరావతి (ప్రజా అమరావతి);

 *నూతన విద్యావిధానంపై అధికారులతో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.** 

ఆంధ్ర ప్రదేశ్ విద్యా వ్యవస్థలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంస్కరణలు అమలు చేసి విద్య కు కొత్త నిర్వచనం ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఈ  ప్రభుత్వం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎన్ ఈ పి 2020 అమలు ప్రణాళికపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాఠశాల విద్య డైరెక్టర్ చిన్నవీరబధ్రుడు, డీఈఓ లు, ఆర్జేడీ లు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ...ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాల పురోగతిని పరిశీలించే నిమిత్తం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారులు వీలయినంత ఎక్కువగా సాంకేతికతను ఉపయోగించుకోవాలని, నూతన సాంకేతికతకు సంబందించిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి ముందుకు సాగాలి.

పునాది విద్యా, పూర్వ ప్రాధమిక విద్యా ఉపయోగం మరియు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మరియు నూతన జాతీయ విద్యా విధానం పై విద్యా శాఖాధికారులందరు స్పష్టమైన అవగాహనతో ఉండాలి.

పిల్లలు 6 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి 90 శాతం మానసిక ఎదుగుదలను పొందుతాడు. కావున, ఆ వయసు నుండే విద్యాభ్యాసము మరియు విద్యా సముపార్జనకు అడుగులు పడాలని ఎన్నో పరిశోధనలు తెలియచేసిన సందర్భంలో పూర్వ ప్రాధమిక విద్యకు ఎంతో ప్రాధాన్యత వచ్చింది. 

శిశు సంక్షేమ శాఖ మరియు పాఠశాల విద్యాశాఖను కలిపి  సమన్వయంతో   ముందుకు సాగి బలమైన పునాది విద్యను విద్యార్థులకు అందించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. 

ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త రకాల పాఠశాలలు పరిచయం చేసే సందర్భంలో ఉపాధ్యాయ పోస్ట్ లు పోతాయనే అపోహను గాని, పిల్లలు ఇబ్బంది పడతారనే  అపోహ గాని నివృత్తి చేయవలసిన బాధ్యత అధికారులపై ఉంది. తప్పనిసరిగా తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు , ఉపాధ్యా సంఘ ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకోవలసిన అభిప్రాయం ఎంతయినా ఉంది. 

ఇంత పెద్ద సంస్కరణలను అమలు చేసే ప్రక్రియలో ఉపాధ్యాయ వర్గ అపోహలను, అనుమానాలను నివృత్తి చేయవలసిన భాద్యతలను తప్పని సరిగా ప్రాంతీయ అధికారులు, జిల్లా అధికారులు తీసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. 

ఈ ప్రభుత్వం పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అభివృద్ధికి నాడు - నేడు అనే మహత్తర కార్యక్రమం ద్వారా మొదటి దశకు ఇప్పటికే 3600 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది. రెండవ దశ ఆగస్టు 16 నుండి ప్రారంభం కానుంది. మొత్తం ప్రతిపాదిత ఖర్చు అక్షరాలా 16000 కోట్ల రూపాయలు. ఈ మహత్తర అక్షర సేద్యం, విద్యా యజ్ఞంలో మీరు అందరు భాగస్వామ్యులు కావాలని విద్యాభివృద్ధికి మనస్ఫూర్తిగా సహకరించాలి.

మీరందరు సమర్థ గల అధికారులు. మీ మన శాఖ అభివృద్ధి కి మనస్ఫూర్తిగా మీ సహాయ సహకారాలు ఎంతో అవసరం.  

పాఠశాలల లో భౌతిక వసతులను అభివృద్ధి చేసి నాడు - నేడు కార్యక్రమం ద్వారా ఉన్నత స్థాయికి చేర్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. అలాగే విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచే విషయంలో ప్రణాళిక బద్దంగా చిత్త శుద్ధితో సంకల్పంతో ప్రయత్నం మొదలు పెట్టాం. నాణ్యమైన విద్య ను అందించే విషయంలో ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ మరియు అన్ని అవసరాలను తీరుస్తాం. సెకండరీ గ్రేడ్ టీచర్ నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు వారి పదోన్నతుల ఫై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాం.