ఉపరాష్ట్రపతితో భాజపా రాష్ట్ర బృందం భేటీ.

 *ఉపరాష్ట్రపతితో భాజపా రాష్ట్ర బృందం భేటీ* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పివిఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవనంలో ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారిని, మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వారితో చర్చించారు. అనంతరం, ఇటీవలే మరణించిన భాజపా పూర్వ అధ్యక్షులు శ్రీ చిలకం రామచంద్రారెడ్డి గారి జీవిత చరిత్రను తెలిపేలా ప్రచురించనున్న పుస్తకాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరించాలని కోరారు.


 *కిషన్రెడ్డితో భేటీ* 


భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పివిఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన *శ్రీ గంగాపురం కిషన్రెడ్డి గారి ని* ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని 3 చారిత్రాత్మక ప్రదేశాలను “ఆదర్శ్ స్మారక్” ప్రదేశాలుగా గుర్తించడం, గండికోటను అడాప్ట్-ఎ-హెరిటేజ్ పథకంలో చేర్చడం పట్ల, రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలను తెలిపారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, బీచ్లు, హిల్ స్టేషన్లు ఉన్నాయని పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పలు ప్రాజెక్టులు అమలుచేయాలని కోరారు.


అనంతరం *భాజపా నేతలు కేంద్ర పార్లమెంటరీశాఖ మంత్రి, భాజపా రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీ వి. మురళీధరన్* ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. వైకాపా ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భాజపా చేపట్టిన ఆందోళనలు, ఉద్యమాల కార్యమాలపై రూపొందించిన బ్రోచర్ను ఈ సందర్భంగా మురళీధరన్ ఆవిష్కరించారు. మురళీధరన్ ను కలసిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారితో పాటు రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్, సి.ఎం. రమేష్, జీవిల్ నర్సింహారావు, భాజపా జాతీయ కార్యదర్శి, సహా ఇంచార్జి సునీల్ దేవధర్, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.

Comments