ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

 జులై 20, 2021

అమరావతి


*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు*


ముస్లిం సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు.

దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు.  భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ  పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ ఆకాంక్షించారు. 

అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ జగన్ అభిలషించారు.

Comments