*గ్రామ, వార్డు సచివాలయాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టని అధికారులకు మెమోలు
*
*మీకు మెమోలు ఇవ్వడ మంటే నా పనితీరు మీద నేను మెమో ఇచ్చుకున్నట్టే*
*కాని క్రమశిక్షణను పాటించాలంటే వేరే మార్గం లేదు
మీరు విఫలం అయితే.. నేను విఫలం అయినట్టే*
*అర్హులెవ్వరూ మిగిలిపోకూడదు... అనర్హులకు అందకూడదు*
*గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పులు ఉంటే మీరు, నేను కలిసి సరిదిద్దాలి*
*పేదవాడ్ని పట్టించుకోకపోతే విధులను సరిగ్గా నిర్వర్తిస్తున్నట్టు కాదు*
*క్షేత్రస్థాయి తనిఖీల ద్వారా పనితీరు, సమర్థత మెరుగుపడతాయి*
*వచ్చే ‘‘స్పందన’’ నాటికి నిర్దేశించిన విధంగా నూటికి నూరుశాతం తనిఖీలు జరగాలి*
*స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఆదేశాలు*
అమరావతి (ప్రజా అమరావతి):
*స్పందనలో సీఎం ఏమన్నారంటే......*
గ్రామ, వార్డు సచివాలయాలు మన మానస పుత్రికలు : సీఎం
వాటిని మనం ఓన్‌చేసుకోకపోతే వీటి పురోగతి క్షీణిస్తుంది:
గ్రామ, వార్డు సచివాలయాల సమర్థత పెరగాలంటే అ«ధికారుల తనిఖీలు చాలా ముఖ్యం:
క్షేత్రస్థాయి తనిఖీలు చేయకపోతే... వాటి పురోగతి కష్టం అవుతుంది:
కలెక్టర్లు, జేసీలు, ఐటీడీఏ పీఓలు, సబ్‌కలెక్టర్లు, మున్సిపల్‌కమిషనర్లు తప్పకుండా క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేయాలి:
అధికారులు తనిఖీలు చేయకపోతే.. మనం అంతట మనమే గ్రామ, వార్డు సచివాలయాల సమర్థతను తగ్గించినవారం అవుతాము:
కలెక్టర్లు వారానికి 2 గ్రామ లేదా వార్డు సచివాలయాలను, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్‌కమిషనర్లు, పీఓ ఐటీడీఏలు, సబ్‌కలెక్టర్లు.. వీరందరూ కూడా వారానికి కనీసం 4 గ్రామ, లేదా వార్డు సచివాలయాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు తప్పకుండా చేయమని చెప్పాం:
తనిఖీలపై ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణ చేస్తుందని చెప్పాం:
పురోగతి చూస్తే.. 1098 క్షేత్రస్థాయి తనిఖీలు చేయాలని చెప్తే, 733 తనిఖీలు, అంటే 66.75శాతం మాత్రమే చేశారు:
ఇందులో కలెక్టర్లు 78 చోట్ల క్షేత్రస్థాయి తనిఖీలు చేయాల్సి ఉండగా, 83 చోట్ల చేశారు.. అంటే 106 శాతం లక్ష్యాన్ని సాధించారు.
జేసీ ( గ్రామ, వార్డు సచివాలయాలు)లు 156 చోట్ల చేయాల్సి ఉండగా, 167 చోట్ల చేశారు. 107 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు.
వీరంతా క్షేత్రస్థాయి తనిఖీల్లో బాగానే పనిచేశారు.
కాని, జేసీ (రెవిన్యూ) 78శాతం, జేసీ హౌసింగ్ 49శాతం, జేసీ (ఏ అండ్ డబ్ల్యూ) 85శాతం, మున్సిపల్ కమిషనర్లు 89శాతం, ఐటీడీఏ పీఓలు 18శాతం, సబ్ కలెక్టర్లు 21 శాతం మాత్రమే చేశారు.
వీరందరి పనితీరు చాలా బ్యాడ్‌గా ఉంది:
ఇది అంగీకార యోగ్యం కాదు:
క్షేత్రస్థాయి పర్యటనలు చేయని వారందరికీ మెమోలు జారీచేయమని సీఎంఓ అధికారులను ఆదేశించాను:
వీందరికీ మెమోలు వస్తాయి:
క్షేత్రస్థాయి తనిఖీల ఉద్దేశ తీవ్రతను వీరు సరిగ్గా అర్థంచేసుకున్నట్టు లేదు:
అధికారులుగా మనం ఏంచేస్తున్నట్టు:
మనం సరిగ్గానే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నామా?:
మనంచేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేస్తున్నామా?
గ్రామ, వార్డు సచివాలయాలకు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లకపోతే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా తెలుస్తాయి:
పెన్షన్ సకాలానికి అందుతుందా?లేదా?ఎలా తెలుస్తుంది?:
మనం వెళ్లకపోతే సకాలానికి రేషన్‌కార్డు వస్తుందా?లేదా? ఎలా తెలుస్తుంది?:
పేదలు, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఇవి ప్రారంభించాం:
ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయా?లేదా? అన్న విషయం క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లకుంటే ఎలా తెలుస్తుంది?:
తప్పులు ఏమైనా జరుగుతుంటే.. వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది:
తప్పులు జరక్కుండా చూసుకునేలా తగిన చర్యలు తీసుకుంటాం:
అసలు మనం క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లకపోతే మన విధులకు ఏం న్యాయం చేసినట్టు?
ఇది ఆమోదయోగ్యం కాదు:
మొదట మనం మనుషులం, ఆతర్వాతే అధికారులం:
మొదట మనలో మానవీయ దృక్పథం ఉండాలి:
మనం అంతట మనమే పేదవాడ్ని పట్టించుకోకపోతే మనం విధులను సక్రమం నిర్వర్తిస్తున్నట్టు కాదు:
వచ్చే స్పందన కల్లా... ప్రతి ఒక్కరూ కూడా 100శాతానికి పైగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి:
క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్నప్పుడు అర్హులందరికీ డీబీటీ పథకాలు వస్తున్నాయా? లేదా? చూడండి:
సామాజిక తనఖీకోసం పెట్టిన జాబితాలను ఒక్కసారి పరిశీలించండి:
జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్ ప్లే చేస్తున్నారా?లేదా?చూడండి:
ప్రతి నెల వేర్వేరు పథకాలను అమలు చేస్తున్నాం:
వీటికి సంబంధించి అర్హుల జాబితాలను అక్కడ అతికిస్తున్నాం:
కొంతమందికి సమయం కూడా ఇచ్చి దరఖాస్తు చేసుకోమని చెప్తున్నాం:
వారంతా దరఖాస్తులు పెడుతున్నారు:
ఆతర్వాత వాటిని వెరిఫికేషన్ చేస్తున్నారా? లేదా? పరిశీలించండి:
వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ పథకాలు వస్తున్నాయా?లేదా?ఒక్కసారి పరిశీలన చేయండి:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్లు, బియ్యంకార్డులు, ఇంటిపట్టాలు, ఆరోగ్యశ్రీ... నిర్దేశిత సమయంలోగా వెరిఫికేషన్ పూర్తిచేసి అర్హులకు ఇస్తున్నామా? లేదా? చూడండి:
మనకు ఓటు వేయని వారికి కూడా, అర్హులైతే వారికి పథకాలు తప్పకుండా అందాల్సిందే:
అనర్హులకు అందకూడదు :
ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం :
అర్హులకు రావాలి, అనర్హులకు రాకూడదు :
వీటిని స్వయంగా పర్యవేక్షించాలి:
వెరిఫికేషన్ పూర్తైన తర్వాత అర్హులని తేలితే, వారికి పథకం రాకపోతే కచ్చితంగా ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది:
ఈ అంశాలను మా దృష్టికి మీరు తీసుకు రావాలి:
దీనివల్ల వెంటనే తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుంది:
తప్పులు ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి:
మీరే నా కళ్లు, చెవులు... మీరు తప్పకుండా క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లాలి:
వీరు విఫలం అయితే , నేను విఫలం అయినట్టే:
ఒక జట్టు మాదిరిగా మనం కలిసి పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం:
మీరే నా చేతులు, కళ్లు, చెవులు :
మీరు క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది:
క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తున్నప్పుడు వివిధ పథకాలకు సంబంధించిన పోస్టర్లు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచుతున్నారా? లేదా? అర్హుల జాబితాలను అతికిస్తున్నారా?లేదా? సంక్షేమ క్యాలెండర్ ఉందా?లేదా?ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన ఫోన్‌నంబర్లు అక్కడ పెడుతున్నారా?లేదా?చేసుకోండి:
అర్హులైన వారికి ఏదైనా రాకపోతే.. ఎవరికి కంప్లైంట్‌చేయాలన్నదానిపై నంబర్లను అక్కడ ఉంచారా? లేదా? చూసుకోండి:
సచివాలయాల ద్వారా అందుతున్న సర్వీసులు జాబితాను అక్కడ ఉంచారా?లేదా?చూసుకోండి:
ఆసర్వీసులన్నీ నిర్దేశిత సమయంలోగా ఇస్తున్నారా? లేదా?చూసుకోండి:
సచివాలయాలకు ఇచ్చిన ఫోన్లుగాని, బయోమెట్రిక్ పరికరాలు కాని, స్కానర్లుకాని... ఈ హార్డ్‌వేర్ అంతా సరిగ్గా పనిచేస్తున్నాయా?లేదా చూసుకోండి:
రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ సరిగ్గా ఉందా? లేదా?చూసుకోండి:
ఉద్యోగుల బయోమెట్రిక్‌హాజరు, వాలంటీర్ల హాజరు, ఇవన్నీకూడా సరిగ్గా జరుగుతున్నాయా?లేదా?చూసుకోండి:
సచివాలయాల్లో సిబ్బంది అటెండెన్స్ ఇచ్చాక అందుబాటులో ఉంటున్నారా?లేదా చూసుకోండి:
సచివాలయ విధివిధానాలను సక్రమంగా అమలు చేస్తున్నారా? లేదా? చూసుకోండి:
వీటన్నింటిపైనా పర్యవేక్షణ చేయాలి:
లేకపోతే వీటి సమర్థతకు గ్యారెంటీ ఇవ్వలేం:
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నైపుణ్యాలను నేర్చుకుంటున్నారా?లేదా? అధికారులు తనఖీల్లో భాగంగా చూడాలి:
ప్రొబేషన్ నుంచి రెగ్యులర్‌ఉద్యోగులు అవుతున్నప్పుడు వారికి నైపుణ్యాలను నేర్పించే కార్యక్రమాలను చేపట్టడం కూడా మన బాధ్యత:
వారికి సరైన శిక్షణ కూడా ఇవ్వడం మన బాధ్యత:
తనిఖీలు చేస్తున్నకొద్దీ.. అవన్నీ మనకు అర్థవం అవుతాయి:
మనం తనిఖీలు చేస్తున్నకొద్దీ ప్రజలకు సేవలు మెరుగుపడతాయి:
ఏదైనా వినతితో ప్రజలు మన దగ్గరకు వచ్చినప్పుడు వారిని చిరునవ్వుతో స్వాగతించడం కూడా చాలా ముఖ్యం:
ఆమేరకు గ్రామ, వార్డు, సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలి:
2 శాతం, అంటే 230 గ్రామ సచివాలయాల్లో ఇంకా హాజరును గణిచండంలేదు:
వివరాలు తెప్పించుకుని వెంటనే దీనిపై దృష్టిపెట్టండి:1.42 లక్షల మందిలో 10శాతం ఇంకా అటెండెన్స్‌మార్కింగ్ జరగడం లేదు:
వీటిని సరిదిద్దితే మంచి ఫలితాలు వస్తాయి:
మీకు మెమోలు జారీచేయడం నాకు చాలా బాధ కలిగించే విషయం:
మీరంతా మన ఉద్యోగులు:
కాని, క్రమశిక్షణను పాటించాలంటే వేరే మార్గం లేదు:
మీకు మెమోలు ఇవ్వడం అంటే నా పనితీరుమీద నేను మెమో ఇచ్చుకున్నట్టే:
addComments
Post a Comment