*రానున్న మూడు రోజులు వర్షాలు రానున్నాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలి:-*రానున్న మూడు రోజులు వర్షాలు  రానున్నాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలి:-**పనిచేసే చోటే నివాసముండి చర్యలు తీసుకోవాలి*


*ఉదృతంగా ప్రవహించే వాగులు, వంకలోకి ప్రజలెవరూ దిగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టండి :-*


*ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టండి :-*


*అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండండి :-*


*టెలీ కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ :-*


కర్నూలు, జులై 22 (ప్రజా అమరావతి):


రానున్న మూడు రోజుల వర్షాలు బాగా కురిసే అవకాశాలున్నాయని జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల స్థాయి అధికారులందరూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఆయా గ్రామాల్లో పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ జి .వీరపాండియన్

అధికారులను ఆదేశించారు. 


గురువారం స్థానిక కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.


*జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ నిన్నటి రోజు నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్ష తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జిల్లా, డివిజన్, మునిసిపల్, మండల స్థాయి అధికారులందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్నూలు, నంద్యాల పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చూస్తూ అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు పునరావాస శిబిరాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆయా మండలాల్లో వర్షం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల వివరాలను సేకరించాలని విపత్తుల నిర్వహణ డీపీఎంను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 


నల్లమల అటవీ ప్రాంతం బండి ఆత్మకూరు, సిరివెళ్ల, ఆళ్లగడ్డ, గోస్పాడు, జూపాడు బంగ్లా, శ్రీశైలం, కొత్తపల్లి పలు ప్రాంతాలలో అధికంగా వర్షాలు కురుస్తున్నాయిని అక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రహదారులు డ్యామేజీ ఏమైనా  ఉంటే నివేదికలు వెంటనే పంపించాలని ఆర్అండ్ బి అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మేకలు, గొర్రెలు, పశువులు మృతి చెంది ఉంటే వెంటనే వివరాలు పంపించాలన్నారు. 


పూరి గుడిసెలు, మట్టి మిద్దెలు పాక్షికంగానూ, పూర్తిగా  దెబ్బతిన్న వెంటనే ఇంటి స్థలం,  ఇల్లు మంజూరు చేయాలనీ జిల్లా కలెక్టర్  ఆర్డీవో లను ఆదేశించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో డయేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా, నీరు కలుషితం కాకుండా ఉండేందుకు  క్లోరినేషన్ చేయాలని, ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిపిఓను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో ఈ ఓ పి ఆర్ డి లు పర్యటిస్తూ గ్రామంలో నీరు నిల్వ లేకుండా ఉండేందుకు చర్యలు చేపడుతూ క్లోరినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించేలా చూడాలని డిపిఓ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని పి హెచ్ సి లు, సబ్ సెంటర్లలో కావలసినన్ని మందులను నిలువ ఉంచుకొని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వైద్యులు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ ఓ ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 


రోడ్లు బ్లాక్ అయితే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని, రోడ్డుకు అడ్డంగా చెట్లు పడి పోతే వెంటనే క్లియర్ చేయాలని ఆర్ అండ్ బి , పీఆర్ ఇంజనీర్లను, విద్యుత్ నిలిచి పోతే వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని  విద్యుత్ ఇంజనీర్లను ఆదేశించారు. నదిలోకి ఎవరు దిగకుండా ఉండేలా నిఘా ఉంచాలన్నారు. ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టలన్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు


ఉదృతంగా ప్రవహించే వాగులు, వంకలోకి ప్రజలెవరూ దిగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టలన్నారు. . గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద ప్రవాహంలో, వాగులు, వంకలు, నదుల్లో మనుషులు, పశువులు దిగకుండా, వహనాలతో దాటకుండా చర్యలు తీసుకోవాలని, పాడుబడిన రేకుల, మట్టి మిద్దెలు, పాత గోడలు, చెట్ల కింద, పాత బ్రిడ్జీలకింద ఉండవద్దని ప్రజలను అలెర్ట్ చేయలన్నారు. ప్రజలు, వాహనదారులు ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలను దాటకుండా, వాగుల్లో దిగకుండా తెలిపే విధంగా పోలీసులు, ఆర్ అండ్ బి అధికారులు రెడ్ కలర్ సూచిక బోర్డులు పెట్టాలన్నారు. జిల్లా స్థాయి నుంచి కింది స్థాయి వరకు సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండి ఎక్కడ ఏ అవసరం వచ్చినా వెంటనే తరలివెళ్లి ప్రజలకు సాయం చేసేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు..


*అదేవిధంగా జిల్లాలోని ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలిసహాయక చర్యల కోసం కంట్రోల్ రూం లను సంప్రదించాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు* *తుఫాన్ సహాయక చర్యల 24×7 కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు.. వాటి నెంబర్లు*


*కర్నూలు కలెక్టరేట్ : 08518 - 277305*


*నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం : 08514 - 221550 / 8333989013*


*ఆదోని ఆర్డీఓ కార్యాలయం: 8333989012*


*కర్నూలు ఆర్డీఓ కార్యాలయం - 8333989011*Comments