వైయస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం అని సిఎం శ్రీ వైయస్ జగన్ అభిప్రాయం.
ప్రజల ప్రయోజనాలు,ఉద్యోగుల బాగోగులు వేర్వేరు కాదు.రెండూ ఒకటే.
ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చింది.
కరోనా సమయంలో కూడా సంక్షేమపధకాలను ప్రజల ముంగిటకు చేర్చిన ఘనత ఉద్యోగులదే.
ఉద్యోగుల విషయంలో చేసిన వాగ్దానాలన్నింటిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ నెరవేరుస్తారు.
ఉద్యోగుల సమస్యలను పాజిటివ్ దృక్పధంతోనే ప్రభుత్వం చూస్తుంది.
ఎన్జీఓ నేత చంద్రశేఖరరెడ్డి అభినందనసభలో ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు శ్రీసజ్జల రామకృష్ణారెడ్డి.
తాడేపల్లి (ప్రజా అమరావతి); వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉద్యోగులకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఆలోచనాతీరును ఆ నిర్ణయాలు తెలియచేస్తున్నాయని ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని ప్రైవేటు కల్యాణమండపంలో ఏపి ఎన్ జి ఓ సంఘ నేత నలమారు చంద్రశేఖరరెడ్డి అభినందన సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమనే ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఎప్పుడూ చెబుతుంటారని తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నిరంగాలలో అగ్రగామిగా నిలవాలన్నా,ప్రజల జీవనప్రమాణాలు పెరగాలన్నా అది భాధ్యతాయుతంగా పనిచేసే ఉద్యోగుల వల్లనే సా«ధ్యమవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.కరోనా వంటి కష్టసమయంలో కూడా శ్రీ వైయస్ జగన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను ప్రజల ఇంటి ముంగిటకు తీసుకువెళ్లిన ఘనత ఉద్యోగులదేనని వారందర్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు శ్రీ వైయస్ జగన్ చెప్పమన్నారని సజ్జల తెలియచేశారు.
శ్రీ వైయస్ జగన్ నూతన ఉద్యోగాలను సృష్టించారు.
శ్రీ వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 42 వేల ఉద్యోగాలను సృష్టించారు.ప్రపంచ చరిత్రలో ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మనం చూసి ఉండం.ప్రజలకు అందించాల్సిన సేవలు గ్రామసచివాలయాల ద్వారా త్వరితగతిన పారదర్శకంగా అందించాలనేది ఆయన లక్ష్యం.ఆ లక్ష్యసాధనలో భాగంగా గ్రామసచివాలయాల వ్యవస్ధ ను ఏర్పాటు చేశారు.ఆ ఉద్యోగ నియామకాలలో కనీసం ఇంటర్వూల వంటివి కూడా లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతిభ కలిగిన వారికి అది కూడా వెనకబడిన వర్గాల వారికి దాదాపు 80 శాతం ఉద్యోగాలను అందించారు.వారికి సహాయంగా రెండులక్షల 55 వేలమందితో వాలంటీర్ల వ్యవస్ధను ఏర్పాటుచేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు.తద్వారా వారికి ఉద్యోగభధ్రతను పెంచారు.కాంట్రాక్ట్ ,అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నవారిని సైతం ఏపి కార్పోరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్(ఆప్కాస్ ) పేరుతో సంస్ధను ఏర్పాటుచేసి ఆ ఉద్యోగులలో ఆత్మవిశ్వాసం పెంచారు.
ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.
రాజకీయపార్టీ అంటే పవర్ ని ఎంజాయ్ చేసేది కాదని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారి అభిప్రాయం.ప్రజాసేవలో భాగమవ్వాలనేది ఆయన ఉధ్దేశ్యం.రాజకీయనేతల కంటే ఉద్యోగులు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వం అయినా ఇటు ప్రభుత్వ ప«ధకాల విజయమైనా ఉద్యోగుల పనితీరు పైనా ఆధార పడి ఉంటుంది.ఎన్నికలకు ముందు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో,హామీలు ఇచ్చారో వాటిలో అత్యధికంగా శ్రీ వైయస్ జగన్ గారు అమలు చేశారు.మిగిలినవి కూడా అమలు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలనేది ఆయన ఆలోచన .ఆయా పధకాలను సక్సెస్ చేయడంలో మీరు భాగస్వాములవ్వాలని కోరుకుంటున్నాం.ఎన్జీఓ నేతలు గాని,ఉద్యోగులు గాని ఏ సమస్యగురించి మా వద్దకు వచ్చినా వాటిని వెంటనే పరిష్కరించేలా పాజిటివ్ గా ప్రయత్నిస్తున్నాం.చంద్రబాబు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.గత ప్రభుత్వాలు ఉద్యోగులను మభ్యపెట్టే విధంగా పైకి ఒకటి చెబుతూ అమలులో మరో విధంగా వ్యవహరించేలా నిర్ణయాలు తీసుకున్నాయి.ఈ ప్రభుత్వం అలా కాదు.పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తుంది.ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పనిచేస్తోంది.
ఉద్యోగసంఘాల మ«ధ్య ఏదైనా విభేదాలు ఉన్నా వారిలో వారు పరిష్కరించుకోవాలి గాని వారిలో గ్రూపులను ప్రోత్సహించేపని ఈ ప్రభుత్వం ఎప్పుడూ చేయబోదని జగన్ స్పష్టం చేశారని తెలియచేశారు.అదే విధంగా వారికి ఎటువంటి వే«ధింపులు ఉండబోవు అని ముఖ్యమంత్రి మాటగా చెబుతున్నానని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
చంద్రబాబు ఈ ప్రభుత్వానికి 2.60 లక్షల కోట్ల మేర అప్పులు మిగిల్చివెళ్లడమే కాదు.60 వేల కోట్ల రూపాయల మేర పెండింగ్ బిల్లుల భారాన్ని కూడా వదిలివెళ్లారు.ఎన్నికలకు ముందు తిరిగి రామని తెలిసి కూడా వచ్చే ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేయాలనే ఉధ్దేశ్యంతో ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేశారు.శ్రీ వైయస్ జగన్ ఆ భారాన్ని మోస్తూనే ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా అధికారంలోకి రాగానే 27 శాతం ఇంటిరియమ్ రిలీఫ్ ప్రకటించారు.ఉద్యోగసంఘాల నేతలు ముఖ్యమంత్రిగారిని సందర్భంలో మాకు ఎప్పుడూ ఒకటే చెబుతారు అదేమంటే వారు చెప్పే సమస్య ఏదైనా సరే అది ఎలా పరిష్కారం చేయాలో చూడాలని చెబుతారు. ఎన్జీఓ నేత ఎన్ చంద్రశేఖరరెడ్డి సేవలను ఉపయోగించుకునేలా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
addComments
Post a Comment