వ‌సంత‌మండ‌పంలో శ్రీ‌మ‌ద్రామాయ‌ణ పారాయ‌ణం ప్రారంభం. వ‌సంత‌మండ‌పంలో శ్రీ‌మ‌ద్రామాయ‌ణ పారాయ‌ణం ప్రారంభం.


       

 తిరుమల (ప్రజా అమరావతి):

      శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని, స‌క‌ల కార్యాలు సిద్ధించాల‌ని కోరుతూ తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ‌మ‌ద్రామాయ‌ణ పారాయ‌ణం ఆదివారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. 

 ఆగ‌స్టు 23వ తేదీ వ‌ర‌కు 30 రోజుల పాటు ఈ పారాయ‌ణం జ‌రుగ‌నుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

 ఈ సంద‌ర్భంగా ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ శ్రీ‌మ‌ద్రామాయ‌ణ పారాయ‌ణం ఒక జ్ఞాన‌య‌జ్ఞమ‌న్నారు. వేద‌స్వ‌రూప‌మైన రామాయ‌ణ పారాయ‌ణం ద్వారా భ‌క్తి, జ్ఞానం, వైరాగ్యం, చిత్త‌శుద్ధి క‌లుగుతాయ‌ని, వీటి ద్వారా మోక్షం ల‌భిస్తుంద‌ని చెప్పారు. మోక్ష‌సాధ‌నే మాన‌వ జీవితానికి సార్థ‌క‌త అన్నారు. ఈ పారాయ‌ణ గ్రంథాన్ని ఎస్వీబీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామ‌ని, భ‌క్తులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని పారాయ‌ణం చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. రామాయ‌ణంలోని బాల‌కాండ, అయోధ్య‌కాండ‌, అర‌ణ్య‌కాండ‌, కిష్కింధ‌కాండ‌, సుంద‌ర‌కాండ‌, యుద్ధ‌కాండలోని ప్ర‌ధాన‌మైన స‌ర్గ‌ల‌ను రోజుకు ఒక‌టి చొప్పున పారాయ‌ణం చేస్తామ‌న్నారు. అయితే జ‌న్మాంత‌ర స‌క‌లసౌఖ్య‌ప్రాప్తి కోసం యుద్ధ‌కాండ‌లోని 131వ స‌ర్గ‌లో గ‌ల 120 శ్లోకాల‌ను 30 రోజుల పాటు పారాయ‌ణం చేస్తామ‌ని వివ‌రించారు. 

 మ‌రోవైపు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో హోమాలు, జ‌పాలు, హనుమంత‌, సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రాముని మూల‌మంత్రానుష్టానం జ‌రుగుతాయ‌ని తెలియ‌జేశారు.

 ఈ కార్య‌క్ర‌మాల్లో మొత్తం 32 మంది వేద‌పండితులు పాల్గొంటున్నార‌ని చెప్పారు.

 తొలిరోజు ధ‌ర్మ‌కార్యసిద్ధి కోసం పారాయ‌ణం:

తొలిరోజు ధ‌ర్మ‌కార్య‌సిద్ధి కోసం అయోధ్య‌కాండ‌లోని 21 నుండి 25 స‌ర్గ‌ల్లో గ‌ల 221 శ్లోకాలు, జ‌న్మాంత‌ర స‌క‌లసౌఖ్య‌ప్రాప్తి కోసం యుద్ధ‌కాండ‌లోని 131వ స‌ర్గ‌లో గ‌ల 120 శ్లోకాలు క‌లిపి మొత్తం 341 శ్లోకాల‌ను పారాయ‌ణం చేశారు. ముందుగా హ‌నుమ‌త్ సీతాలక్ష్మ‌ణభ‌ర‌తశ‌త్రుజ్ఞ స‌మేత శ్రీ‌రాముల‌కు పూజ‌లు నిర్వ‌హించి ఐదు అర‌టి పండ్లు నైవేద్యంగా స‌మ‌ర్పించారు.ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సీఈవో శ్రీ సురేష్‌కుమార్‌, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం పండితులు పాల్గొన్నారు.

 

Comments
Popular posts
స్పందన" లేని పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
Team Sistla Lohit's solidarity for Maha Padayatra
Image
విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati): October, 18 :- దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు నిజ ఆశ్వయు శుద్ద విదియ, సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తా విద్రుడు హేమ నీల థవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్థరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్, గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హస్తైర్వహంతీంభజే శరన్నవరాత్రి మహత్సవములలో శ్రీ కనకదుర్గమ్మ వారుశ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ది పొంది ముక్తా, విదృమా హేమనీల దవలవర్ణాలతో ప్రకాశించు పంచకుముఖాలతో దర్శమిచ్చే సంద్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మా, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివశిస్తుండగా త్రిముర్త్యాంశగా గాయంత్రి దేవి వెలుగొందుచున్నది. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రి మంత్రంతో అనుబంధంగా ఉంది. గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తరువాతే నివేదిన చేయబడతాయి. ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగాకొలుస్తూ, గాయత్రీమాతను దర్శించడం వలన సకల మంత్రసిద్ది ఫలాన్ని పొందుతారు. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు.
Image
అమరావతి రైతుల మహా పాదయాత్ర చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది
Image
మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని.
Image