శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
ఆషాడ మాసం సందర్భంగా శ్రీ అమ్మవారికి పవిత్ర సారె సమర్పించుటకు గాను చీరలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, స్వీట్లు మరియు ఇతర వస్తువులతో బృందములుగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఈరోజు పలు బృందముల వారు దేవస్థానం నకు విచ్చేయగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు..
శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ పవిత్ర సారె సమర్పించే భక్తుల కొరకు దేవస్థానం నందు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గౌరవ ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు మరియు
శ్రీయుత కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ ఆదేశముల మేరకు ఆలయ అధికారులు
శ్రీ అమ్మవారికి సారె సమర్పించిన భక్త బృందం వారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం, భక్తులు మహామండపం 6 వ అంతస్తు నందు ఏర్పాటు చేసిన శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తి వద్దకు చేరుకుని భక్తితో శ్రీ అమ్మవారి నామస్మరణతో నామ పారాయణలు చేయగా, సారె సమర్పించిన భక్తబృందం వారి కొరకు ఆలయ అర్చకులు పూజ నిర్వహించారు.
addComments
Post a Comment