సోనూసూద్ దాతృత్వంతో ఏర్పాటైన ఆక్సిజన్ ప్లాంట్ ను లాంఛనంగా ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 ఆత్మకూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);


*సోనూసూద్ దాతృత్వంతో ఏర్పాటైన ఆక్సిజన్ ప్లాంట్ ను లాంఛనంగా ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


*


*మెట్ట ప్రాంతం, మంత్రి సొంత నియోజకవర్గం ఆత్మకూరులో రూ.కోటిన్నరతో ఆక్సిజన్ ప్లాంట్  నిర్మాణం*


*ప్లాంట్ కు సంబంధించిన ఎక్విప్ మెంట్ రవాణా పనుల కోసం స్వయంగా రూ. 5 లక్షలిచ్చిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


నియోజకవర్గ ప్రజల మేలు కోసం తన వంతుగా భాగస్వామ్యమై ప్లాంట్ నిర్మాణాన్ని నాటి నుంచి నేటివరకూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన మంత్రి గౌతమ్ రెడ్డి


త్వరలోనే  నియోజకవర్గానికి రావాలని సోనుసూద్ ని ఆత్మకూరు ప్రజల తరపున ఆహ్వానించిన మంత్రి గౌతమ్ రెడ్డి


రాబోయే 2 నెలల్లో తప్పనిసరిగా వస్తానని మంత్రి గౌతమ్ రెడ్డికి  తెలిపిన సినీనటులు సోనుసూద్


అన్ని వసతులుండే పట్టణాలలో కాకుండా మెట్టప్రాంతంలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలనుకున్న సోనూసూద్ ది పెద్దమనసని కొనియాడిన మంత్రి మేకపాటి


సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి, ఆక్సిజన్ ప్లాంట్ ను ఆత్మకూరులో ఏర్పాటు చేయడానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సహా జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి అధికార యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించిన మంత్రి గౌతమ్ రెడ్డి


దేశవ్యాప్తంగా ఎంతోమందికి సాయం చేస్తున్న సినీనటులు సోనూసూద్ ఫౌండేషన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అండగా నిలవడం కోసం సీఎంఆర్ఎఫ్ కు మరోసారి విరాళం ప్రకటించిన నాగలక్ష్మి


సోనూ సూద్ ఫౌండేషన్, సీఎంఆర్ఎఫ్ కు తన వంతుగా రూ.25వేల చొప్పున మొత్తం రూ.50 వేలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన దివ్యాంగురాలు నాగలక్ష్మి 


*నిస్వార్థంగా విరాళమిచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచిదంటూ నెల్లూరు జిల్లా మహిళ నాగలక్ష్మిని సన్మానించిన మంత్రి మేకపాటి*


సాధారణ,మధ్యతరగతి అయి ఉండి ఎంతో పెద్ద మనసుతో సాయం చేసిన నాగలక్ష్మికి చేస్తోంది సన్మానం కాదు, సమాజం కోసం పాటు పడే ప్రతి ఒక్కరికీ  మనమిచ్చే గౌరవం


*ఆత్మకూరు నియోజకవర్గంలో  రూ.1800 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పరుగులు*


*దాదాపు రూ.300 కోట్లతో సచివాలయం భవన నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ కేంద్రాలు, బీఎంసీయూ భవనాలు, ఇళ్ల పట్టాలు, నాడు-నాడు స్కూళ్లలో పనులు, సీసీ రోడ్లు, డ్రెయిన్లు, జలజీవన మిషన్ పనులు, వైఎస్ఆర్ డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటు*


చురుకుగా జరుగుతున్న ఆత్మకూరులోని నారంపేట ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు పనులు 


ఆత్మకూరు నియోజకవర్గంలో బిజీబిజీగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


ఆత్మకూరు పట్టణ జిల్లా ఏరియా ఆస్పత్రిలో సినినటులు సోనూసూద్ దాతత్వంతో నిర్మించబడిన ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్మించిన కొత్త వైఎస్ఆర్ అగ్రీ టెస్టింగ్ ల్యాబ్ ను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి గౌతమ్ రెడ్డి


ఏ.ఎస్ పేటలోని కుప్పురుపాడు గ్రామంలో "జగనన్న పచ్చతోరణం" ప్రారంభించిన మంత్రి మేకపాటి


మొక్కలు నాటడం కాదు..చెట్లుగా..వృక్షాలుగా పెంచడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి


6 నెలల తర్వాత వచ్చి మొక్కల ఎదుగుదలను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని స్థానిక అధికారులు, నాయకులకు వెల్లడించిన మంత్రి మేకపాటి


మున్సిపల్ కార్యాలయంలో ఆత్మకూరు ప్రజలతో  "స్పెషల్ గ్రీవెన్స్ డే" నిర్వహించిన పరిశ్రమల  శాఖ మంత్రి


అనంతసాగరం మండలంలో చుక్కల భూముల ఇబ్బందుల గురించి మంత్రి సహా అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఆ మండల వైసీపీ నాయకులు బట్రెడ్డి జనార్థన్ రెడ్డి


రైతు భరోసా, పింఛన్ల వంటి రెవెన్యూ సంబంధిత సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ కి వివరించిన ప్రజలు


చుక్కల భూముల సమస్యలను త్వరలోనే పరిష్కారిస్తామని జాయింట్ కలెక్టర్ వెల్లడి


చుక్కల భూములకు సంబంధించిన ఆర్.హెచ్ (రిజిస్ట్రేషన్ హోల్డ్) వంటి మూడు పత్రాలను తీసుకుని పరిష్కరించే విధంగా జాయింట్ కలెక్టర్ చొరవ


రైతు భరోసా అందుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగిస్తామని మంత్రి సమక్షంలో జేసీ హామీ


రైతు భరోసా, పింఛన్ వంటివి అర్హత కోల్పోవడానికిగల కారణాలను ప్రజలకు అవగాహన కలిగించిన జేసీ హరేంద్రప్రసాద్


సంగం మండలంలో ప్రజలు కోరిన శ్మశాన స్థలం త్వరలోనే చూపిస్తాం


ప్రాధాన్యత క్రమంలో వేగంగా రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలి : మంత్రి మేకపాటి


ఎంపీడీవోలు, ఎంఆర్వోలు సమన్వయంతో ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కృషి చేయాలి


మంత్రి పర్యటనలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్లు హరేంద్ర ప్రసాద్, గణేష్, తెలుగుగంగ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగుణమ్మ, ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, మున్సిపల్ ఛైర్మన్ గోపవరం వెంకటరమణమ్మ, జిల్లా స్థాయి అధికార యంత్రాంగం, నియోజకవర్గ , మండల స్థాయి వైసీపీ నాయకులు తదితరులు...Comments