తిరుమల, జులై 24 (ప్రజా అమరావతి);
అన్నదానం కాంప్లెక్స్‌లో దాతల కౌంటర్ ప్రారంభం
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో శనివారం దాతల కౌంటర్‌ను టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ చేశారు.
దాతలు ఇక్కడ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు సమర్పించేందుకు వీలుగా యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో కౌంటర్ ఏర్పాటు చేశారు. భక్తులు రూ.100/- నుండి విరాళాలు అందించవచ్చు.
ఈ కార్యక్రమంలో అన్నదానం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి, యూనియన్ బ్యాంకు ఎజిఎం శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
addComments
Post a Comment