మంగళగిరి (ప్రజా అమరావతి);
*జూలై 19న సీఎం ఇల్లు ముట్టడిస్తాం*
- *జాబ్ క్యాలెండర్ ఒక డూప్ క్యాలెండర్
*
- *నిరుద్యోగ యువత భవిష్యత్ అంధకారమైంది*
- *శాంతియుతంగా నిరసన తెలిపే స్వేచ్చ లేదా?*
- *కొత్త జాబ్ క్యాలెంర్‌ను విడుదల చేయాలి*
- *తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్*
ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధి సంఘాలు, నిరుద్యోగులు, యువకులు చేస్తున్న నిరసనల్లో భాగంగా సీఎం ఇల్లు ముట్టడి అంశంపై మంగళగిరి నియోజకవర్గం తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
స్థానిక ఎంఎస్ఎస్ భవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో నియోజకవర్గ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇటీవల విడుదల చేసిన జాబ్ కేలండర్ ను వెనక్కి తీసుకొని కొత్త జాబ్ క్యాలండర్ విడుదల చేయకపోతే నిరుద్యోగ యువతతో కలిసి 19వ తేదీ సోమవారం నాడు సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ జగనన్న జాబ్ కేలండర్ తో నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారం లోకి నెట్టి వేయబడిందని, రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆత్మహత్య లు చేసుకోవడం తప్ప వేరే దారి కనిపించటం లేదని అన్నారు.
*మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పడవల మహేష్ కామెంట్స్*ః
రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్ల మీద ఆందోళనలు చేస్తుంటే ముఖ్యమంత్రి, మంత్రులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
శాంతియుతంగా నిరసన తెలిపే స్వేచ్చ ఈ రాష్ట్రం లో లేదు.
ఆర్టికల్ 19 ను భారత రాజ్యాంగం కల్పించిన మహోన్నతమైన హక్కు . ఈ హక్కు ప్రకారం ఎవరైనా నిరసన తెలియజేయవచ్చు.
ఆ హక్కును కాలరాస్తూ పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలు చాలా సిగ్గు పడాల్సిన విషయం.
నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు.
జగన్ అధికారం లోకి రాక ముందు చెప్పింది ఏమిటి ? ఇప్పుడు చేస్తున్నది ఏమిటి ?
అధికారం లోకి వచ్చాక రెండేళ్ల తర్వాత నిద్ర లేచిన జగన్ రెడ్డి కేవలం 10,143 ఉద్యోగాలు విడుదల చేసి నిరుద్యోగులకు ద్రోహం చేశారు.
2 లక్షల 30 వేల ఉద్యోగాలకు ఖాళీలు ఉంటే జాబ్ క్యాలెండర్ పేరుతో 10,143 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగు లకు అన్యాయం చేయడం భావ్యం కాదు.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ప్రభుత్వం వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలి
నిరుద్యోగులకు న్యాయం జరగని పక్షంలో తెలుగుయువత, టి. యన్. యస్. యఫ్,అఖిలపక్ష యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం.
కొత్త జాబ్ క్యాలండర్ విడుదల చేయకపోతే 19వ తేదీ సోమవారం నాడు సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడి చేస్తాం.
*మంగళగిరి నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు రాయపూడి కిరణ్ కామెంట్స్*ః
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఒక పెద్ద డూప్ క్యాలెండర్.
రాష్ట్రంలోని అఖిలపక్ష విద్యార్ధి సంఘాలు పిలుపునిస్తే ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్ట్లతో ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్, విద్య, ఆరోగ్య, గ్రూప్ 1, 2 ఉద్యోగాలు కనపడటం లేదా?
జూలై 19న అఖిల పక్షాలు సీఎం ఇంటిని ముట్టడికి నిర్ణయిస్తే ప్రభుత్వానికి భయం పట్టుకుంది.
అన్యాయంగా కేసులు బనాయిస్తోంది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నిరుద్యోగులను పెయిడ్ ఆర్టిస్ట్‌లు అని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు.
ఒక వేళ మీరు అన్నట్లు నిరుద్యోగులు పెయిడ్ ఆర్టిస్ట్‌లు అయితే సీఎం ఇంటిని ముట్టడిస్తామంటే ఎందుకంత భయం?
ఆదివారం సాయంత్రం లోపల కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయకపోతే సీఎం క్యాంపు ఆఫీస్‌ను ముట్టిడి చేస్తాం.
కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొప్పుల మధుబాబు, పట్టణ తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి గంటా దుర్గాప్రసాద్, పట్టణ తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి తాటి అవినాష్, పట్టణ తెలుగు యువత కార్యదర్శి వంగర హనుమాన్, తెలుగు యువత నాయకులు, పి. రాజ్‌కుమార్, మేకల సుధీర్, నిరుద్యోగులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment