కర్నూలు, జూలై 19 (ప్రజా అమరావతి);
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ .
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
కోవిడ్ నేపథ్యంలో నేరుగా కాకుండా డయల్ యువర్ కలెక్టర్ ద్వారా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.ఫోన్ చేసి సమస్యలు తెల్పిన అర్జీ దారులకు రసీదు ఇవ్వాలి.సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదు.సత్వరమే స్పందించాలని జిల్లా అధికారులకు కలెక్టర్ ఆదేశం.ముఖ్యమంత్రి గారు 15 రోజులకు ఒకసారి స్పందన పేరుతో ముఖ్యమైన అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
మన జిల్లా ఏ అంశంలోనూ వెనుకబడి ఉండకూడదు
.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్దేశించిన సమయానికి బయోమెట్రిక్ తప్పనిసరి.
ఈ అంశంలో ఎలాంటి రాజీ వుండకూడదు
జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) ,సంబంధిత జిల్లా అధికారులు, ఎంపీడీఓ లు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వే అసిస్టెంట్ తదితర క్షేత్ర స్థాయికి వెళ్లి పని చేయాల్సిన సచివాలయ సిబ్బంది నేరుగా ఫీల్డ్ విజిట్ కు వెళ్ళకూడదు.ప్రజలకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించాలి..క్రమశిక్షణ తో విధులు నిర్వహించాలి.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది డిప్యూటేషన్ లను రద్దు చేశాం..వారి స్వంత స్థానాల్లో విధుల్లో చేరారో లేదో చూడాలి.నేమ్ బోర్డు, లబ్దిదారుల జాబితా,సేవల వివరాలు,ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి జాబితా ల పోస్టర్లు, నవరత్నాలు సంక్షేమ పథకాల క్యాలెండర్ల పోస్టర్లు ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో తప్పకుండా ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలి.జిల్లా అధికారులు వారానికి నాలుగు గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేసి వెంటనే రిపోర్ట్ సబ్మిట్ చేయాలి..వాటిపై సమీక్షిస్తాం.
జిల్లా అధికారులు Contempt of court cases లోకాయుక్త కేసులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..వీటిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుకోవాలి.కౌంటర్ అఫిడవిట్ లు వేయడం, ఒకవేళ జడ్జిమెంట్ వచ్చిఉంటే , కోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలి..ఈ అంశంలో అధికారులు నిర్లక్ష్యం వహించ కూడదు.కలెక్టరేట్ లో ఉన్న కార్యాలయ సముదాయం శుభ్రత పై కలెక్టర్ అసంతృప్తి.కలెక్టరేట్ లో ఉన్న ఆయా కార్యాలయ అధికారులు తమ కార్యాలయ పరిసరాలన్నీ క్లీన్ గా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) ఈ అంశంపై దృష్టి పెట్టాలని ఆదేశించిన కలెక్టర్.
ఈ అంశంపై ఆయా కార్యాలయ అధికారులకు responsibilities fix చేయాలి.. ఆయా కార్యాలయ ఏరియా కు ఒక కోడ్ ఇవ్వాలి.
మొదటి దశలో క్లీనింగ్, లైటింగ్ పై దృష్టి పెట్టాలని, తదుపరి మరమ్మతులు, రెనోవేషన్ చేయాలి.అలాగే గ్రీనరీ, ట్రాఫిక్ రెగ్యులేషన్ పై కూడా ప్రత్యేక దృష్టి పెడతాం.సమీక్షలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, డి ఆర్ ఓ పుల్లయ్య, జిల్లా అధికారులు తదితరులు.
addComments
Post a Comment