ఏ ప్రభుత్వానికి అయినా ప్రజా సంక్షేమమే ఫైనల్, వ్యక్తిగత ఇష్టాలకు తావివ్వకూడదు

 దుగ్గిరాల (ప్రజా అమరావతి);*చిలువూరు గ్రామ ఇళ్ళ ప్లాట్ ల లబ్ధిదారులు ఇళ్ళ ప్లాట్ ల కొరకు స్థలము సేకరణ విషయం లో చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గారు సమాధానం చెప్పాలి*


*ఏ ప్రభుత్వానికి అయినా ప్రజా సంక్షేమమే ఫైనల్, వ్యక్తిగత ఇష్టాలకు తావివ్వకూడదు*


*చిలువూరు గ్రామ ఇళ్ళ ప్లాట్ ల లబ్ధిదారులు గత నెలరోజులుగా చేస్తున్న నిరసనలకు తెలుగుదేశం పార్టీ తరుపున మద్దతు తెలియజేస్తున్నాము*


- దుగ్గిరాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడూరు వెంకటరావు


దుగ్గిరాల మండలం, చిలువూరు గ్రామ పరిధిలో, ఇళ్ళులేని 213  మంది పేదలకు, కంఠం రాజు కొండూరు గ్రామ పరిధిలో ఇళ్ళ స్థలాల ప్లాట్లు కేటాయించిన విషయం విదితమే..


కాగా గత నెలరోజుల నుండి చిలువూరు లబ్ధిదారులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కంఠం రాజు కొండూరు గ్రామంలో ప్లాట్ లు కేటాయించిన స్థలము లో తెలుగుదేశం పార్టీ నాయకులు, లబ్ధిదారులు తో కలిసి ఆందోళనలో పాల్గొని వారికి మద్దతు తెలియజేసారు


ఈ సందర్బంగా దుగ్గిరాల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గూడూరు వెంకటరావు కామెంట్స్ :


ఏ ప్రభుత్వామయినా ప్రజాభీష్టం మేరకు పనిచేయాలి


వ్యక్తిగత లాభనష్టాలకు లోబడి ఏ ప్రజా పతినిధి పనిచేయకూడదు, ఇది ప్రజాస్వామ్యం, రాచరికం కాదు అని పాలకులు గుర్తుపెట్టుకోవాలి


చిలువూరు గ్రామ ఇళ్ళ స్థల లబ్ధిదారులు గత నెలరోజులు గా ఆందోళన నిర్వహిస్తుంటే ఈ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గారికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు


కంఠం రాజు కొండూరు గ్రామ పరిధిలో మూడు గ్రామాలయిన చిలువూరు, మంచికలపూడి, కంఠం రాజు కొండూరు గ్రామాలకు ప్లాట్ ల కేటాయింపు, ఊరికి దూరంగా కిలోమీటర్ పైన పొలాలలోకి బురదలో నడిచి రావలసిన పరిస్థితి


ప్లాట్ లు చిన్నపాటి వర్షానికే నీటమునిగి బురద మయం


సామాన్యుడు ఇక్కడ ఇళ్ళు కట్టుకోవాలంటే ఆర్ధికభారం, బెల్ట్ వేయాలంటేనే లక్షల్లో ఖర్చు అయ్యే పరిస్థితి


చిలువూరు గ్రామ లబ్ధిదారులు ఏదైతే అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారో వాటికీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి గారు ఖచ్చితంగా సమాధానం చెప్పితీరాలి


ఇక్కడ కంటే తక్కువ ధరకే చిలువూరు పరిధిలో పొలాలు ఉంటే, ఇంత వ్యయంతో ఇక్కడ స్థల సేకరణ చేయడంలో మతలబు ఏమిటో ప్రజలకు తెలుపాలి


సరైన మౌళిక సదుపాయాలు లేవు,500 అడుగులు బోర్ వేసిన నీరు అందని పరిస్థితులు, పిల్లల స్కూల్ సమస్యలు, పనులకు వెళ్లాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి


చిలువూరు గ్రామ లబ్ధిదారులు చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము


వారికి వెంటనే చిలువూరు గ్రామ పరిధిలోనే ఇళ్ళ స్థలాలు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ తరుఫున డిమాండ్ చేస్తున్నాం


ఈ ఆందోళనలో  లబ్ధిదారులతో పాటు దుగ్గిరాల మండల మహిళా నాయకురాలు ఉన్నం ఝాన్సీ రాణి, గుంటూరు పార్లమెంట్ TNSF ప్రధాన కార్యదర్శి పినపాటి జీవన్,మైనారిటీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎండీ ఇబ్రహీం, నియోజకవర్గ TNUS అధ్యక్షులు వల్లూరు నరసింహారావు,నియోజకవర్గ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి కొప్పుల మధుబాబు, మంగళగిరి మండల తెలుగుమహిళ అధ్యక్షురాలు పాలేటి కృష్ణవేణి, దుగ్గిరాల మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎమినేని కోటేశ్వరరావు, చిలువూరు గ్రామ పార్టీ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య, TNSF దుగ్గిరాల మండల అధ్యక్షులు కోటి యాదవ్,బెజవాడ సాయి వాసిరెడ్డి వినోద్,మేళం ఆనంద్,అత్తోట భారతి ఇంటూరి శ్రీను, అంచ రవిచంద్, ఇజ్జిగాని శంకర్, పాలేటి రాజకుమార్ తదితరులు వున్నారు.