*పంచాయతీల్లో సమూల అభివృద్ధి జరిపేందుకు సర్పంచులు కీలక పాత్ర పోషించాలి.*
*_రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు._*
*మందస సర్పంచుల శిక్షణా కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంత్రి.*
*గ్రామ స్థాయి పరిపాలనలో భాగస్వామ్యం కావాలి.*
పలాస : జులై 23 (ప్రజా అమరావతి):
పంచాయతీల్లో అభివృద్ది , మౌళిక వసతులు కల్పన, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత పంచాయతీ సర్పంచులదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అన్నారు. శుక్రవారం కుంటికోట వై.టి.సి కేంద్రంలో మందస మండలం సర్పంచులకు శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. సర్పంచులు గ్రామాల్లో పూర్తి స్థాయి పాలనా విభాగంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకు వచ్చి గ్రామస్వరాజ్యానికి పునాదులు వేశారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజలకు మౌళిక వసతుల కల్పన ఎంతో అవసరమని అన్నారు. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో నిధులు అందిస్తున్నాయని వాటన్నిటి ఎలా ఉపయోగించాలి అనే విషయం మండల అభివృద్ధి అధికారుల సమక్షంలో శిక్ణణ ఇవ్వడం వలన నిధులను ఎలా అభివృద్ధికి ఉపయోగించాలి అనే విషయం తెలియజేయడానికి ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయని అన్నారు. గతంలో సర్పంచులకు ప్రాధాన్యత ఎలా ఉండేదో వైసిపి ప్రభుత్వం ప్రాధాన్యత ఎలా ఇస్తుందో మీరే అర్ధం చేసుకోవాలని తెలిపారు. 14, 15 వ ఆర్ధిక సంఘ నిధులు ద్వారా పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధ్యం అని తెలిపారు. సచివాలయాలు నిర్మిస్తూ సర్పంచులకు ప్రధాన స్థానం ఏర్పాటు చేసి సర్పంచుల కార్యాలయం ఏర్పాటు చేసిన ఘన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దని అన్నారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలని వారికి సముచిత స్థానం కల్పించేందుకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి రాజకీయాల్లో, చట్ట సభల్లో స్థానం కల్పించిన ఏకైక రాజకీయ పార్టీ, ప్రభుత్వం కూడా వైసిపి అని అన్నారు. పంచాయతీలకు ఆర.బి.కె కేంద్రాల, పాల సేకరణ కేంద్రాలు కల్పించి రైతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధి జరగాలని కోరారు. పంచాయతీల్లో సర్పంచులకు తెలియకుండా ఏపని జరిగేది ఉండదని ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం కూడా సర్పంచుల సమక్షంలో లబ్దిదారులకు అందించేలా ఉండాలని అన్నారు. వర్షా కాలంలో వ్యాదులు ప్రభలే అవకాశం ఉందని వాటిని అరికట్టడానికి ముందస్తుగా గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తి స్థాయిగా జరగాలని అన్నారు. కోరినేషన్ చేయాలని మంచి నీటి బావులు, కొళాయి లు వద్ద బ్లీచింగ్ వేయించాలని పరీశరాలు శుభ్రంగా ఉంచడం బాధ్యతగా తీసుకోవాలని సర్పంచ్ లకు కోరారు. పాలనా విభాగంలో సర్పంచులు మరింత శిక్షణ పొంది గ్రామ స్థాయి పరిపాలనకు ఉపకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మందస, పలాస మండలాల మండల అభివృద్ధి అధికారులు తిరుమలరావు, ఎన్.రమేష్ నాయుడు లతోపాటు, ఇఒపిఆర్ డిలు పాల్గొన్నారు. మందస మండలం లో ఉన్న సర్పంచులు పాల్గొన్నారు.
addComments
Post a Comment