తాడేపల్లి మున్సిపాలిటీలో ఎవరు పేదలకు న్యాయం చేసారు ?

 తాడేపల్లి మున్సిపాలిటీలో ఎవరు పేదలకు న్యాయం చేసారు ?


తాడేపల్లి (ప్రజా అమరావతి);

 2016లో పుష్కరాల సమయంలో పేదలకు అన్యాయం జరగలేదా?

 నేటికి కూడా వారందరూ దుర్బర జీవితాన్ని గడపడం లేదా?

 అప్పుడు జరిగిన అన్యాయానికి అధికారం ఉండి కూడా న్యాయం చేయలేకపోయారు.


తాడేపల్లి మున్సిపల్ పరిధిలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు దాన్ని తప్పుబడుతున్నారు.


 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన నివాసాన్ని ఉండవల్లి- అమరావతి కరకట్ట వెంబడి నిషేధిత స్థలంలో అక్రమంగా ఆక్రమించుకొని నివాసముంటున్నారు. అతని నివాసానికి వెళ్లే మార్గంలో పిడబ్ల్యుడి వర్క్ షాప్, కొండవీటి వాగు బ్రిడ్జి నుండి బకింగ్ హామ్ కెనాలకు మధ్య నివాసముంటున్న వారిని ఇరిగేషన్ భూమిలో నివాసాలు ఉంటున్నారంటూ కనీసం నోటీసులు ఇవ్వకుండా తొలగించారు.


వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాడేపల్లి పట్టణంలో స్థలం కొనుక్కొని ఇల్లు నిర్మించుకుని నివాసాం ఉంటున్నారు. ఆయన 2019లో ముఖ్యమంత్రి అయ్యాక అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాల వారు ముఖ్యమంత్రి భద్రతా దృష్ట్యా అక్కడ ఉన్న నివాసాలను తొలగించాలని హడావిడి చేయడంతో  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ననివాసం ఉంటున్న వారికి న్యాయం చేయకుండా ఇళ్లను తొలగించడానికి వీల్లేదన్నారు. ఇరిగేషన్ కట్ట అక్రమించుకుని నివాసముంటున్న వారి ఇళ్లను తొలగించే  క్రమంలో అందరికీ నష్టపరిహారం నేరుగా వారి ఖాతాలో జమ చేసి,అర్హులైన ఒక్కొక్కరికి రెండు సెంట్ల స్థలం కేటాయించి,ఇళ్లు నిర్మించుకునేందుకు 1,80,000 రూపాయలు కేటాయిస్తాం అన్న తరువాత వారు ఇళ్లను స్వచ్ఛందంగా తొలగించుకునే క్రమంలో  కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకులు వారి స్వార్ధం కోసం గొడవలు సృష్టించడంపట్ల అమరారెడ్డి కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 25-5-2016న జరిగిన పుష్కరాల సందర్భంగా  ఎన్టీఆర్ కాలనీలో 27 నివాసాలు, పుష్కర ఘాట్ల వద్ద వివిధ రహదారుల్లో 325 నివాసాలు తొలగించారు. వాటి సంగతి ఇప్పుడు పోరాడుతున్న నాయకులెవరూ మాట్లాడకపోవడం విశేషం.


 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులాలు చూడం, మతాలు చూడం మరీ ముఖ్యంగా పార్టీలు చూడం అంటారు దానికి నిదర్శనమే అమరారెడ్డి కాలనీలో నివాసముంటున్న టిడిపి మహిళా నాయకురాలికి, ఆమె కుమార్తెకు మరియు ఆమె సోదరునికి సైతం నష్ట పరిహారం మరియు ఒక్కొక్కరికి రెండు సెంట్లు చొప్పున మూడు ప్లాట్లు కేటాయించింది నేటి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వం.

Comments