కాకాణి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం.

 *"కాకాణి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం.


*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం, మండపం, గొల్లపాళెం గ్రామాలలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .*


*సిమెంట్ రోడ్లు, సి.సి.డ్రైన్లు, వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి*


*గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.* మండపం గ్రామపంచాయతీ పరిధిలో అధికార పార్టీ శాసనసభ్యునిగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసి, పూర్తి చేసి ప్రారంభించడం సంతోషంగా ఉంది.

 సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు వెచ్చించి, భూములు కొనుగోలు చేసి, లేఅవుట్లు అభివృద్ధి చేసి, అర్హత కలిగిన వారందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు అందించాం.

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, గత తెలుగుదేశం పార్టీలో మాదిరి పక్షపాత వైఖరితో కాకుండా అర్హులైన వారందరికీ అమలు చేస్తున్నాం.

 సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో పూర్తిస్థాయిలో మట్టిరోడ్డు కనిపించకుండా, సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం.

 కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచన చేయకుండా, పేదవాడికి అండగా నిలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారు.

 సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు పూర్తి స్థాయిలో వసతి, సదుపాయాలు కల్పించేందుకు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తా.