శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):  ఆషాడ శుద్ధ పౌర్ణమి  రోజున దేవస్థానము నందు శాకంభరీ ఉత్సవములలో మూడవ రోజు (చివరి రోజు)  ఉదయం వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉదయం 08 గం.ల నుండి సప్త శతి హవణము, మహావిద్యా పారాయణము, శాంతి పౌష్టిక హొమము నిర్వహించిన అనంతరము ఉ.11 గం.లకు పూర్నాహుతి, కూష్మాండ బలి, మార్జనము కలశోద్వాసన, ఆశీర్వాదము కార్యక్రమములు నిర్వహించడము జరిగినది. ఈ కార్యక్రమము నందు గౌరవనీయులైన పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొడాలి వేంకటేశ్వర రావు గారి కుటుంబం, ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ పైలా సోమి నాయుడు దంపతుల  వారు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ , పాలకమండలి సభ్యులు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమములు నిర్వహించారు.  పూర్ణాహుతి సమర్పించడముతో అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవములు విజయవంతముగా ముగిసినవని ఆలయ వైదిక కమిటీ సభ్యులు వారు తెలిపారు. దేవస్థానము నందు గర్భాలయము, అంతరాలయము, మరియు ప్రధానాలయము వివిధ రకముల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించబడినది.  శాకంభరీ ఉత్సవముల సందర్భముగా భక్తులందరికీ కదంబం ప్రసాదముగా పంచిపెట్టబడినది.

Comments