డిజిపి కార్యాలయం (ప్రజా అమరావతి);
డిజిపి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయలను ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను తనిఖీ చేస్తున్న డిఐజి లు, ఎస్పీలు.
మహిళా పోలీసులు క్షేత్ర స్థాయిలో అందిస్తున్న సేవలనుతో పాటు గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, వారి విద్యార్హతలు, వారు అందించే సేవలను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నుండి స్వయంగా వివరాలను అడిగి తెలుసుకుంటున్న డిఐజిలు, ఎస్పీలు.
సచివాలయాల పరిధిలో నివసించే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలను అర్హత కలిగిన వారికి అందించే విధంగా చేపడుతున్న చర్యలను పరిశీలిస్తున్న అధికారులు.
సచివాలయల పరిధిలో నివసిస్తున్న మహిళల రక్షణకు, సైబరు నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను మహిళా పోలీసులు అధికారులకు వివరించారు.
భవిష్యత్తులో మహిళా పోలీసుల సేవలతో ప్రజలకు పోలీసుశాఖ మరింత చేరువయ్యేందుకు అవసరమైన మరిన్ని చర్యలు,కార్యచరణ చేపడతామని గ్రామ, వార్డు సచివాలయల సిబ్బందికి అధికారులు వివరించారు.
addComments
Post a Comment