ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి.
త్వరితగతిన గ్రామ సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి.
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్.
ఎన్ పి కుంట మండలం వెలిచెలమల గ్రామంలో ఈ క్రాప్ బుకింగ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
అనంతపురం, జూలై 15 (ప్రజా అమరావతి):
జిల్లాలో ప్రతి రైతు కూడా ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. గురువారం కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్ పి కుంట మండలం వెలిచెలమల గ్రామంలోని గ్రామ సచివాలయంలో డా.వైఎస్సార్ రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఈ క్రాప్ బుకింగ్ (ఈ పంట నమోదు) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుంచి డా.వైఎస్సార్ రైతు భరోసా చైతన్య యాత్రలను ప్రారంభించడం జరిగిందని, ఇందులో భాగంగా ఈ క్రాప్ బుకింగ్ కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ మార్చి ప్రారంభించడం జరిగిందని, ఈ క్రాప్ బుకింగ్ లో ప్రతి ఒక్కరూ నమోదు కావాలన్నారు. ఇందులో పంట వివరాలు, విస్తీర్ణం నమోదు చేయాలని, ఈ క్రాప్ బుకింగ్ వల్ల సున్నా వడ్డీ పంట రుణాలు, వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం, పంట కొనుగోలు అవకాశం, పంట నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుందన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ లు అంతా సజావుగా, జాగ్రత్తగా ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియను చేపట్టాలన్నారు. రైతులు పేరు, పంట, విస్తీర్ణం నమోదు అయిందా లేదా చూసుకోవాలన్నారు.
డా.వైఎస్సార్ రైతు భరోసా చైతన్య యాత్రల ద్వారా రైతుల చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుని పంటల సాగు చేసుకోవచ్చన్నారు. రైతు భరోసా చైతన్య యాత్రల గురించి రైతులకు తెలియజేయాలని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు భరోసా చైతన్య యాత్రల ద్వారా సూచనలు తీసుకుని వ్యవసాయంలో మంచి దిగుబడి, ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతు భరోసా చైతన్య యాత్రలలో వివిధ పంటలలో మంచి దిగుబడి, ఆదాయం పొందిన రైతుల అనుభవాలు తెలియజేయడం జరుగుతుందని, దీని ద్వారా మరికొంత మంది రైతులు లబ్ది పొందేందుకు స్ఫూర్తి లభిస్తుందన్నారు. అలాగే రైతు భరోసా కేంద్రాలను నూతనంగా నిర్మిస్తున్నామని, వాటి ద్వారా మండల కేంద్రానికి వెళ్లి సమయం, ఖర్చు వృధా చేసుకోకుండా గ్రామస్థాయిలో రైతులకు వ్యవసాయ రంగం, ఉద్యాన రంగంలో, పశువులకు సంబంధించిన టీకాలు వేయడం, ఎరువులు, మందులను, విత్తనాలను అందజేయడం జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నామన్నారు. రైతులు కూడా పంట మార్పిడికి ముందుకు రావాలని, ఇతర పంటలలో అధిక దిగుబడి సాధించిన రైతులను ఆదర్శంగా తీసుకుని మంచి దిగుబడి, ఆదాయం పొందాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలను కలిసి సాగు చేసుకున్నప్పుడు రైతులకు మంచి ఆదాయం, జీవనోపాధి లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు భరోసా యుడిపి (యూనిఫామ్ డిజిటల్ యాప్) యాప్ ద్వారా ఈ క్రాప్ బుకింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి రైతుకు డిజిటల్ సర్టిఫికెట్ ను అందజేశారు. ఆ తరువాత కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులను జిల్లా కలెక్టర్ అందించారు. తదనంతరం రైతులకు ఉచితంగా ఎరువుల సంచులను పంపిణీ చేశారు.
అనంతరం వెలిచెలమల గ్రామంలోని రైతు సరస్వతి పొలాన్ని పరిశీలించి రైతు భరోసా యుడిపి యాప్ ద్వారా ఈ క్రాప్ బుకింగ్ ను చేయించి రైతుకు సర్టిఫికెట్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పంట వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు.
త్వరితగతిన భవన నిర్మాణాలను పూర్తి చేయాలి :
అంతకుముందు జిల్లా కలెక్టర్ ఎన్ పి కుంట మండలం వెలిచెలమల గ్రామంలో డా.వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలను పరిశీలించారు. డా.వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకోగా శుక్రవారం ప్రారంభానికి సిద్ధంగా ఉందని పీఆర్ ఏఈ జిల్లా కలెక్టర్ కి తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలను నిర్దేశించిన సమయంలోగా త్వరితగతిన పూర్తి చేయాలని పీఆర్ ఏఈని ఆదేశించారు. ఆయా భవనాల నిర్మాణాలను నాణ్యతగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, ఆర్డీఓ వెంకట్ రెడ్డి, ఏడీఏ సత్యనారాయణ, తహశీల్దార్ పివి రమణ, ఎంపిడిఓ ఆదినారాయణ, వ్యవసాయ అధికారి శంకరలాల్ నాయక్, ఏవో శ్రీనివాసులు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, సిరికల్చర్ ఎడి, వెటర్నరీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment