మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తలసాని...
హైదరాబాద్ సిటీ (ప్రజా అమరావతి) : లష్కర్ ఆషాఢ బోనాల జాతరతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం తెల్లవారుజామున 4గంటలకే బోనాల మహోత్సవం ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. కాగా.. *సోమవారం రంగం (భవిష్యవాణి) వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి...!!
addComments
Post a Comment