- బతకలేని చంద్రబాబు టీడీపీని బతికిస్తాడని అనుకుంటున్న కార్యకర్తలు
- ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిస్తే బాగా పొడిచాడంటారు
- చెప్పులతో కొట్టిస్తే చంద్రబాబు సూపర్ గా కొట్టించాడంటారు
- ఎన్టీఆర్ పనికిరాడని బయటకు పంపామని చెబుతుంటారు
- ఆశయాలను కూడా సాధిస్తామని ఓట్లు అడుగుతుంటారు
- చంద్రబాబుది ఏదైనా చేయగలిగే నీచాతినీచమైన స్వభావం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
తాడేపల్లి, జూలై 28 (ప్రజా అమరావతి): చంద్రబాబు ఒక బతకలేని వెధవ అని, అతను టీడీపీని బతికిస్తాడని ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుకుంటూ వస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్‌కు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహనరెడ్డి వెన్నుపోటు పొడవలేదన్నారు. వైశ్రాయ్ హెటల్ లో ఆయనను చెప్పులతో కొట్టిన వెధవ చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిస్తే టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం బాగా పొడిచాడని, చెప్పులతో కొడితే సూపర్ గా కొట్టాడంటారన్నారు. టీడీపీనిని బతికించడానికి ఎన్టీఆర్ ను చంద్రబాబు కొట్టించాడని సమర్ధించుకుంటున్నారన్నారు. చంద్రబాబే ఒక బతకలేని వెధవ అని, అతను టీడీపీని బతికిస్తాడని అనుకుంటూ వస్తున్నారన్నారు. వాళ్ళు చేసిన తప్పులు, పొడిచిన వెన్నుపోట్లను పక్కన వాళ్ళపై రుద్దడం బాగా అలవాటని అన్నారు. దేవినేని ఉమా వెళ్ళిన కారు ఎక్కడా డ్యామేజ్ కాలేదన్నారు. వైసీపీ కార్యకర్త కారు మాత్రమే ధ్వంసమైందన్నారు. కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కు వైసీపీ కార్యకర్తలు వెళ్ళారన్నారు. అది తెలుసుకుని స్టేషన్ ఎదురుగా దేవినేని ఉమా కారులో కూర్చున్నాడన్నారు. ఎల్లో మీడియాలో దేవినేని ఉమాను నిర్బంధించినట్టుగా చిత్రీకరించారన్నారు. ఎన్టీఆర్ ను చంపిన, వెన్నుపోటు పొడిచిన, చెప్పులతో కొట్టించిన వెధవలు వాళ్ళేనని అన్నారు. మళ్ళీ ఎన్టీఆర్ ను పూజించే, ఆయన పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే వెధవలు కూడా వాళ్ళేనని అన్నారు. ఎన్టీఆర్ పనికిరాని వ్యక్తి అని, అందువల్లే పార్టీ నుండి బయటకు పంపించేశామని చెబుతూనే, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పుకుంటారన్నారు. ఏదైనా చేయగలిగే నీచాతినీచమైన స్వభావం కల్గిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయన దగ్గర పనిచేస్తున్న వెధవలంతా గొప్పగా మాట్లాడతారని తాను అనుకోవడం లేదని మంత్రి కొడాలి నాని అన్నారు.
addComments
Post a Comment