మంగళగిరి (ప్రజా అమరావతి);
*జగనన్న పచ్చ తోరణం – వన మహోత్సవం 2021
*
*మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో మొక్కనాటి ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.*
*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*
*బాలినేని శ్రీనివాసరెడ్డి, అడవులు, పర్యావరణ శాఖా మంత్రి*
ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కల్పించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో భాగంగా మన రాష్ట్రంలో 23 శాతం ఉన్న అటవీ విస్తీరణం 33 శాతం పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. మన రాష్ట్రం అటవీ విస్తరణలో దేశంలో రెండో స్ధానంలో ఉంది, దానిని మొదటి స్ధానంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నాం. దీనికి తోడు అటవీ శాఖ జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా వివిధ శాఖల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నాం, దీంతోపాటు నాడు నేడు కార్యక్రమం, జగనన్న కాలనీలలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. సీఎంగారు భాద్యతలు చేపట్టిన తర్వాత వర్షాలు బాగా పడుతున్నాయి, గతంలో వర్షాలు పడక ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఇది రామరాజ్యం కాబట్టి వర్షాలు సమృద్దిగా కురుస్తున్నాయి. 5 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం, వలంటీర్ల ద్వారా మొక్కలు పంచుతున్నాం, దీనిని కూడా పచ్చ మీడియా వక్రీకరించి రాస్తుందని భయంగా ఉంది. ప్రతీ విషయానికి ఎల్లో మీడియా దుర్మార్గంగా వక్రీకరిస్తుంది. సీఎంగారిపై ఎంత బురదచల్లినా ప్రజల మనసులో ఆయన చిరస్ధాయిగా నిలిచిపోయారు, నాడు రాజశేఖర్‌రెడ్డి గారు ఎలా ప్రతీ గుండెలో ఉన్నారో అలాగే సీఎంగారు ప్రతీ ఒక్కరి మదిలో నిలిచిపోయారు. అదే టీడీపీ ప్రభుత్వంలో కోట్లు అప్పులు చేసినా ఎల్లోమీడియాకు కనిపించలేదు కానీ సీఎంగారు చేస్తున్న అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక పచ్చ పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయి. కోవిడ్ నేపధ్యంలో ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా ప్రతీ కార్యక్రమం కూడా చెప్పిన తేదీకే అమలుచేస్తూ పాలన సాగిస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా శ్రీ జగన్ గారు మినిమం 20 సంవత్సరాలు సీఎంగా ఉంటారు. టైగర్స్ డే రోజు భారతదేశంలో ఏ సీఎం చేయని విధంగా శ్రీ జగన్ గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన తపన ఎంటో అర్ధమవుతుంది. సీఎంగారు పచ్చదనం కోసం చేసే ప్రతీ కార్యక్రమంలో హాజరైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
*ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్.కే), మంగళగిరి ఎమ్మెల్యే*
ఈ రోజున ఆకుపచ్చని ఆంధ్రావనే లక్ష్యంగా జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా వనమహోత్సవానికి మంగళగిరి నియోజకవర్గం విచ్చేసిన సీఎంగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జగనన్న చూపిన ఈ బాటలో అందరూ నడవాలని, ఈ రాష్ట్రంలో పచ్చదనం పూర్తిగా విస్తరించాలని, మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతీ మొక్క కూడా వృక్షంలా తయారయ్యేందుకు అందరూ కృషిచేయాలి. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళేలా మనం రాష్ట్రంలో ప్రతీ రోజూ వీలైనంత మేరకు మొక్కలు నాటాలి. వాతావరణ సమతుల్యం, వాతావరణ కాలుష్యం తగ్గడానికి, ఆక్సీజన్ అవసరం కూడా తెలుసుకున్నాం కాబట్టి, మొక్కలు, వృక్షాలు అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మనం తలంచి మొక్కలు విరివిగా పెంచాలి అని అందరినీ కోరుతున్నాను.
addComments
Post a Comment