రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల వాయిదా

తిరుమ‌ల‌, 19 ఆగస్టు (ప్రజా అమరావతి);


రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల  విడుదల వాయిదా

 భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదలను పరిపాలనా కారణాల వల్ల టిటిడి వాయిదా వేసింది.

  ప్రతినెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు నెల‌ దర్శన టికెట్ల విడుదల తేదీని త్వరలో తెలియజేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని కోర‌డ‌మైన‌ది.

Comments