- రాష్ట్రవ్యాప్తంగా 36.31 లక్షల కార్డుదారులకు పీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యం పంపిణీ పూర్తి
- 24.44 శాతం కార్డులకు నిత్యావసరాలను అందించాం
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, ఆగస్టు 19 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో 36 లక్షల 31 వేల 216 కార్డుదారులకు రేషన్ డీలర్ల ద్వారా పీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 48 లక్షల 56 వేల 590 బియ్యం కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల్లోని ఒక్కో కుటుంబ సభ్యుడికి 5 కేజీలు చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేయడం జరుగుతోందన్నారు. ఇదిలా ఉండగా కర్నూలు జిల్లాలో మొత్తం 12 లక్షల 27 వేల 319 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 57 వేల 854 కార్డులకు ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేశామని తెలిపారు. అలాగే ప్రకాశం జిల్లాలో మొత్తం 10 లక్షల 06 వేల 337 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల 42 వేల 320 కార్డులకు, పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 12 లక్షల 50 వేల 075 బియ్యం కార్డులు ఉ ండగా ఇప్పటి వరకు 3 లక్షల 07 వేల 521 కార్డులకు, వైఎస్సార్ కడప జిల్లాలో మొత్తం 8 లక్షల 22 వేల 072 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల 11 వేల 356 కార్డులకు, చిత్తూరు జిల్లాలో మొత్తం 11 లక్షల 67 వేల 624 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 25 వేల 951 కార్డులకు, విశాఖపట్నం జిల్లాలో మొత్తం 12 లక్షల 82 వేల 107 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల 97 వేల 459 కార్డులకు, విజయనగరం జిల్లాలో మొత్తం 7 లక్షల 01 వేల 045 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు ఒక లక్షా 69 వేల 335 కార్డులకు, అనంతపూర్ జిల్లాలో మొత్తం 12 లక్షల 31 వేల 605 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 39 వేల 949 కార్డులకు, గుంటూరు జిల్లాలో మొత్తం 14 లక్షల 92 వేల 005 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 80 వేల 415 కార్డులకు, తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 16 లక్షల 53 వేల 564 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 3 లక్షల 98 వేల 464 కార్డులకు, కృష్ణాజిల్లాలో మొత్తం 13 లక్షల 08 వేల 039 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 2 లక్షల 98 వేల 735 కార్డులకు, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 లక్షల 19 వేల 290 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు ఒక లక్షా 45 వేల 496 కార్డులకు, నెల్లూరు జిల్లాలో మొత్తం 8 లక్షల 95 వేల 508 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు ఒక లక్షా 56 వేల 361 కార్డులకు ఉచితంగా బియ్యాన్ని అందజేసినట్టు తెలిపారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ సక్రమంగా సాగుతోందన్నారు. కర్నూలు జిల్లాలో 29.16 శాతం, ప్రకాశం జిల్లాలో 24.08 శాతం, వైఎస్సార్ కడప జిల్లాలో 25.71 శాతం, అనంతపూర్ జిల్లాలో 27.60 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 24.60 శాతం, చిత్తూరు జిల్లాలో 27.92 శాతం, గుంటూరు జిల్లాలో 25.50 శాతం, విజయనగరం జిల్లాలో 24.15 శాతం, విశాఖపట్నం జిల్లాలో 23.20 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 24.10 శాతం, కృష్ణాజిల్లాలో 22.84 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 17.76 శాతం, నెల్లూరు జిల్లాలో 17.46 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తయినట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు.
addComments
Post a Comment