రూ.52 లక్షలతో గుట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేసిన కియా సంస్థ.

 రూ.52 లక్షలతో గుట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేసిన కియా సంస్థ* 


*గుట్టూరు ప్రాథమిక కేంద్రంలో డైయిలీ కేర్ సెంటర్ ప్రారంభించిన మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ* 


 పెనుగొండ, ఆగస్టు 05 (ప్రజా అమరావతి);


గురువారం ఉదయం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ గుట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కియా సంస్థ నిర్మించిన డెయిలీ కేర్ సెంటర్ ను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో   జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ,

కియా ఇండియా సీఎవో కబ్డాంగ్ లీ  తదితరులు పాల్గొన్నారు   ఈ సందర్భంగా  మంత్రివర్యులు మాట్లాడుతూ  జిల్లా పారిశ్రామికాభివృద్దిలో మాత్రమే కాకుండా స్థానికుల ఆరోగ్యాభివృద్ధిలో సైతం పాలు పంచుకుంటున్న కియా సంస్థ ధాతృత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని తెలిపారు.   ప్రభుత్వాసుపత్రులకు వచ్చే నిరుపేద కు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని   ముఖ్యమంత్రి నిరంతర ఆలోచనతో అనేక సంస్కరణలు  చే పడుతున్నాడని తెలిపారు 

జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న క్షేత్రస్థాయి వైద్యాభివృద్ధికి కియా సంస్థ సీఎస్సార్ నిధులు వెచ్చించడం అభినందనీయమన్నారు. 

కియా ఇండియా సీఎవో కబ్డాంగ్ లీ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల అన్ని విధాల అభివృద్ధికి కియా తనవంతు సహాయం అందిస్తుందన్నారు. కరోనా విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 కోట్ల నిధులు కియా ఇండియా అందించిందన్నారు. కియా సంస్థకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

పెనుగొండ నియోజక వర్గంలోని గుట్టూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేసేందుకు కియా సంస్థ రూ. 52 లక్షల నిధులు వెచ్చించి డెయిలీ కేర్ సెంటర్ నిర్మాణం, ఆరోగ్య కేంద్రానికి వైద్య సామాగ్రి అందించడం, ఆరోగ్య కేంద్రం ఆవరణం మెరుగుపరచడం వంటి కార్యక్రమాలు చేపట్టింది. 

ఈ కార్యక్రమంలో  పెనుగొండ సబ్ కలెక్టర్ మల్లారపు నవీన్, డీఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్, సర్పంచ్ బోయ నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. 



Comments