*బందరువానిపేట మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారు.*
*మృతుని కుటుంబాలకు తక్షణ సహాయంగా 5 లక్షల రూపాయలు సహాయం అందించిన ప్రభుత్వం
.*
*చెక్కులు అందించిన మత్స్యశాఖ మంత్రి.*
శ్రీకాకుళం జిల్లా గార మండలం బందరువానిపేట గ్రామానికి చెందిన ముగ్గరు మత్స్యకారులు పడవ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం క్రింద ఆదివారం బాదిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి,శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు లు వారికి అందించారు. ఆదివారం బందరువానిపేట గ్రామాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేపల వేటకు వెల్లి దురదృష్టవశాత్తు పడవ బోల్తా పడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారని ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు మృతి చెందడం మనసుకు ఎంతో బాదకల్గించిందని అవేద వ్యక్తం చేశారు. మత్స్యకారుల జీవితాలు ప్రమాదంలో పడినప్పుడు వారిని ఆదుకునే జగనన్న ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అందుకే తక్షణ సహాయం క్రింద కుటుంబానికి 5 లక్షలు అందించడం తోపాటు వైఎస్ఆర్ భీమా ద్వారా ఒక్కొక్క కుటుంబానికి మరో 5 లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు మత్స్యకారులను నిర్లక్ష్యం చేస్తే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్దికి పాటుపడుతుందని అన్నారు. తొమ్మిది వందల కిలోమీటర్ల పైబడి ఉన్న తీరప్రాంతం లో గతంలో రెండు పోర్టులు మాత్రమే ఉండేవని కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రతి తీర ప్రాంత జిల్లాలో ఒక పోర్టు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుందని అన్నారు. అందుకే రాష్ట్రంలో తొమ్మిది పోర్టుల నిర్మాణం చేపట్టి మత్స్యకారుల అభివృద్దికి పాటుపడుతుందని తెలిపారు. అంతే కాకుండా తీరప్రాంతంలో 50 నుండి 100 కిలోమీటర్ల మద్య మత్స్యకారులకు చేపల వేటకు వీలుగా ఫిషింగ్ జట్టీలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. చేపల వేట ద్వారా మత్స్యకారుల సేకరించిన చేపలను అమ్మకానికి వీలుగా మార్కెటింగ్ హబ్ లు కూడా తయారు చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దని అన్నారు. మత్స్యకారులకు నేను ఉన్నాను అనే భరోసా కల్పంచి గ్రామీణ స్థాయిలో మత్స్య సంపద అమ్మకాలు కొనసాగి మత్స్యకారులకు ఆర్ధికంగా బలోపేతం చేసి మత్స్యకార భరో అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని అన్నారు. సముద్రంలోకి చేపల వేటకు వెల్లేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని వెల్లాలి అని సూచించారు. మృతుని కుటుంబాలకు పరామర్శించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి మీ కష్టాలు తీసుకువెల్లి మరింత మేలుజరిగేలా చూస్తామని కుటుంబాలను ఓదార్చారు.
కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, జిల్లా మత్స్యకార అసోసియేషన్ ప్రెసిడెంట్ కొనాడ నరసింహులు, వైసీపీ నాయకులు, జిల్లా మత్స్యకార ప్రతినిధులు, స్థానిక గ్రామ సర్పంచ్, సొసైటీ అధ్యక్షులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment