మంగళగిరి (ప్రజా అమరావతి);
*ఆంధ్రపదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIIC) చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మెట్టు గోవింద రెడ్డి
.*
*మంగళగిరి లోని ఏపిఐఐసి భవనంలో బుధవారం తన కార్యాలయంలో ఆంధ్రపదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIIC) చైర్మన్ గా శ్రీ మెట్టు గోవింద రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అధికారులు చైర్మన్ కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా రాయదుర్గం నుండి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్దయెత్తున తరలివచ్చారు. అనంతరం ఎపిఐఐసి అధికారులతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేశారు. ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనకు మనం అందరం కృషి చేయాలన్నారు.
addComments
Post a Comment