అమరావతి (ప్రజా అమరావతి);
*మైనార్టీ సంక్షేమశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
వక్ఫ్ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్న సీఎం
వక్ఫ్ భూములపై పూర్తి స్ధాయిలో అధ్యయనం చేయాలి : అధికారులకు సీఎం ఆదేశం
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా ఆ భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలి :
ఉపాధి హామీ పథకం ద్వారా వీటి నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్న సీఎం
ఆలా నిర్మాణం చేపట్టిన తర్వాత ఆయా చోట్ల హోంగార్డులను వాటి రక్షణ కోసం నియమించేలా చూడాలి : సీఎం శ్రీ వైయస్.జగన్
ఆ భూములను ఏ మేరకు వాడుకోగలమో నిపుణలు సలహా తీసుకోవాలి :
వైయస్సార్ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్ ఆస్తులు కూడా సర్వే చేయాలన్న సీఎం
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణలో ఉన్న సుమారు 500 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్న అధికారులు
కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు దిశగా చర్యలుకు సీఎం ఆదేశం
మైనార్టీలకు కొత్త శ్మశాన వాటికలు ఏర్పాటుకు నిర్ణయం సీఎం శ్రీ వైయస్.జగన్
ఈ యేడాది ప్రాధాన్యతాంశంగా తీసుకుని వీటి నిర్మాణం చేపట్టాలి :
అవసరాలకు తగినట్టుగా కొత్త శ్మశానాలు ఏర్పాటు చేయాలి :
ఇమామ్‌లు, మౌజంలు, ఫాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాలు చెల్లింపులు జరగాలి అధికారులకు సీఎం ఆదేశం
వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి
ఇమామ్‌లు, మౌజంలకు గౌరవ వేతనం కోసం కొత్తగా దరఖాస్తులు వచ్చాయన్న అధికారులు
వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
మైనార్టీలకూ సబ్‌ప్లాన్ కోసం అధికారులు ప్రతిపాదన
దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్న సీఎం
సబ్‌ప్లాన్ అమలు అయితే నిధులు కూడా మరింత పెరుగుతాయన్న సీఎం
మైనారిటీ విద్యార్ధుల వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగతున్నాయని వెల్లడించిన అధికారులు
నిర్మాణంలో ఉన్న భవనాలకు సంబంధించిన పనుల ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు
5 గురుకుల పాఠశాలలు, 2 వసతి గృహాలకు సంబంధించి రూ.75 కోట్లతో చేపడుతున్న పనుల ప్రగతిని వివరించిన అధికారులు
పెండింగ్ బిల్లులు బకాయిలు చెల్లించాలని అధికారులను ఆదేశించిన సీఎం
ఇప్పటికే ప్రారంభమైన అన్ని ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి
మైనార్టీ శాఖలో పెండింగ్ సమస్యల పై పూర్తి స్ధాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం
మైనార్టీ విద్యార్ధుల్లో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక ధ్యాస పెట్టాలన్న సీఎం
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలన్న సీఎం
కర్నూలులో ఉర్ధూ యూనివర్సిటీ పనులపై అధికారులను వివరాలడిగిన సీఎం
ప్రయారిటీ కింద తీసుకుని ఫోకస్డుగా యూనివర్సీటీ పనులు చేపట్టాలన్న సీఎం
నాడు–నేడు తరహాలో పనులు చేపట్టాలి : అధికారులకు స్పష్టం చేసిన సీఎం
ఉర్ధూ అకాడమీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని ఆదేశం
అకాడమీని ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం
షాదీఖానాలు నిర్వహణను కూడా మైనారిటీశాఖకు బదిలీ చేయాలి : సీఎం ఆదేశం
మైనారిటీశాఖలో ఖాళీ పోస్టుల వివరాలను వెల్లడించిన అధికారులు
ఉద్యోగ నియమకాలకు సంబంధించి ఆర్ధికశాఖ అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకొండి : సీఎం
విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో హజ్‌హౌస్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు
హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం అంగీకారం
హజ్ కమిటీలు, వక్ఫ్ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, అర్ధాంతరంగా నిలిచిపోయిన క్రిస్టియన్ భవన్ నిర్మాణం :
అసంపూర్ణంగా నిలిచిపోయిన క్రిస్టియన్ భవన్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశం
ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమశాఖ) అంజద్ బాషా, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి గంధం చంద్రుడు, మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్ కె శారదా దేవి, ఏపీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ సీఈఓ పి రవి సుభాష్, ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ అలీం బాషా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment