విద్యా,వైద్యం,మౌలిక సదుపాయాలు కల్పించి మున్సిపాలిటీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలి.

 విద్యా,వైద్యం,మౌలిక సదుపాయాలు కల్పించి మున్సిపాలిటీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలి.రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.


పలాస కాశీబుగ్గ మున్సిపల్ కౌన్సిల్ లో కో ఆప్షన్ సభ్యులను ఎన్నికలో పాల్గొన్న మంత్రి.


మున్సిపల్ అభివృద్ధికి అందరూ కష్టపడాలి.


త్వరలో కెటి రోడ్డు డ్రైనేజి, పుట్ పాత్ పనులకు శంకుస్థాపన.


పలాస: ఆగష్టు 07 (ప్రజా అమరావతి):


పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో విద్య, వైద్యం తోపాటు మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తి స్థాయి అభివృద్ధి జరిగేందుకు పనిచేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ లో జరిగిన కో ఆప్షన్ ఎన్నికలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ని సుందరంగా తీర్చి దిద్దడం తోపాటు ప్రజల అవసరాలను తీర్చి వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కౌన్సిల్ పని చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట కోసం పని చేస్తుందని ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకు వెల్లాల్సిన భాద్యత మీపై ఉందని కౌన్సిల్ ను సూచించారు. ప్రతి ఒక్కరు ప్రజల కోసం పని చేయాలని మీ వార్డుల్లో సమస్యలు తీర్చేందుకు ప్రజలతో మమేకం కావాలని కోరారు.పలాస నియోజకవర్గంలో మూడు మండలాల తోపాటు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని అభివృద్ధి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలనే ఆశయంతో పని చేస్తున్నటు మంత్రి డాక్టర్ అప్పలరాజు తెలిపారు. మున్సిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చే రోజులు దగ్గర పడ్డాయని వాటి పనులు త్వరలోనే పూర్తి చేసుకోబోతున్నామని తెలిపారు. కెటి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని అలాగే త్వరలో డ్రైనేజి ,పుట్ పాత్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేపడతామని అన్నారు. అంతే కాకుండా ప్రతి వార్డులో కూడా డ్రైనేజిలు, రోడ్డు పూర్తిగా నిర్మించుకుని ప్రజలకు మౌలికమైన వసతులు కల్పించేందుకు ప్రణాలికలు చేయాలని కౌన్సిల్ ను కోరారు. మున్సిపాలిటీ ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా ముందుకు పోవాలని కోరారు. ముందుగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి కొ ఆప్షన్ సభ్యులను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ ఎన్నికలో సుజాత త్యాడీ, బమ్మిడి సంతోష్, రోణంకి శ్రీనివాసరావు లను కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారికి మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎన్నిక  సర్టిఫికేట్ అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వైస్ చైర్మన్ లు బోర క్రిష్ణారావు, మీసాల సురేష్ బాబు, విప్ దుర్గాశంకర్ పండా కౌన్సిలర్లు, కమీషనర్ టి.రాజేంద్రబాబు లు పాల్గొన్నారు‌.

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image