రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పనితీరుకు పోలీస్ శాఖ సాధించిన పథకాలే నిదర్శనం...

 రాష్ట్ర  పోలీస్ యంత్రాంగం పనితీరుకు పోలీస్ శాఖ సాధించిన పథకాలే నిదర్శనం...


పోలీస్ క్వార్టర్స్ పోలీసు భవనాల నిర్మాణంతోపాటు గతంలో నిర్మించిన భవనాల అభివృద్ధి... రాష్ట్ర హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత...  విజయవాడ (ప్రజా అమరావతి);        ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసు యంత్రాంగం నిరంతరం సేవలు అందిస్తుందని ఎందుకు  పోలీస్ శాఖ సాధించిన పథకాలే నిదర్శనమని రాష్ట్ర హోం శాఖ మాత్యులు శ్రీమతి మేకతోటి సుచరిత అన్నారు.   రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మెట్టుకూరు చిరంజీవి రెడ్డి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకార  కార్యక్రమంలో హోం శాఖ మాత్యులు శ్రీమతి మేకతోటి సుచరిత సమక్షంలో నియామక పత్రం పై సంతకం చేసి పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మేకతోటి సుచరిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను మెరుగుపరిచి మౌలిక వసతులు కల్పించడం ద్వారా పోలీసులు ప్రజలకు రక్షణ కవచం గా నిలిచి శాంతి భద్రతలను కాపాడటంలో చేస్తున్న కృషిని గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుండి అనేక ప్రశంశలను, పథకాలను సాదిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆలోచనా విధానాలకు అనుగుణంగా పోలీస్ శాఖ ప్రజలందరికీ రక్షణ కల్పించడంతోపాటు ముఖ్యంగా మహిళలు, బాలికలకు ఎటువంటి ఆపద ఏర్పడిన తక్షణమే రక్షణ హస్తం వారి వద్దకు వెళ్లలే దిశా యాప్ ను ముఖ్యమంత్రి రాష్ట్రంలో అమలులోకి తీసుకువచ్చారని ఆమె అన్నారు. దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి మహిళలకు, బాలికలకు ఎటువంటి ఆపద కలిగినా నిమిషాల్లో వారి వద్దకు చేరి రక్షిత కల్పించే అధునాతనమైన సాంకేతిక వ్యవస్థతో కూడిన పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని ఆమె అన్నారు. గతంలో పోలీసులకు నిర్మించిన గృహ సముదాయాలను శిధిలావస్థకు చేరుకున్నాయి అన్నారు. గత ప్రభుత్వం పోలీస్ గృహనిర్మాణాలు అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించడం జరిగిందన్నారు. పూర్వం నిర్మించిన గృహ సముదాయాల తో పాటు పశుసంవర్ధక వ్యవసాయ తదితర శాఖలకు చెందిన నూతన భవన నిర్మాణాలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన చిరంజీవి రెడ్డి ముఖ్యమంత్రి ఆలోచనా విధానాలకు అనుగుణంగా సేవలు అందించి కార్పొరేషన్లకు మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సేవాభావంతో పనిచేసే ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు లభిస్తాయని ఎందుకు నిదర్శనమే చిరంజీవి రెడ్డి నియామకం అన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుధీర్ గా పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. 137 కార్పొరేషన్లకు సమర్థవంతులిన చైర్మన్లను నియమించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే ఆయన ఉద్దేశం అన్నారు. అనుభవజ్ఞుడైన చిరంజీవి రెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ స్థితిగతులను మార్పు చేయడంలో కృతకృత్యులయ్యారు. దానిలో సందేహం లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ దేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం పట్ల ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు సేవలు అందించుటకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ను ప్రగతిపథంలో నడిపించుట జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనా విధానాలకు అనుగుణంగా పని చేస్తానని చిరంజీవి రెడ్డి అన్నారు. పోలీస్ క్వార్టర్స్ పోలీస్ కార్యాలయం భవనాల నిర్మాణాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని నిర్మాణదశలో ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నారు ఆయన అన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తామని చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో చైర్మన్గా చిరంజీవి రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టడం శుభ పరిమాణం అన్నారు. కార్పొరేషన్ ద్వారా గత రెండేళ్లలో త్రిబుల్ ఐటీ, వెటర్నరీ భవనాలు, స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ భవనాలతో పాటు 147 అగ్రీ యాప్స్ భవన నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. గతంలో నిర్మించిన పోలీస్ క్వార్టర్స్ మరమ్మతులు చేసే అభివృద్ధి చేయనున్నామన్నారు. నూతన భవనాల నిర్మాణాల లో పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్, కావలి ఏఎంసి చైర్మన్ సుకుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లా నాయకులు కేశవ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, బాల గురువారెడ్డి, ఏపీ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సీతారామరాజు, సిపి నియర్ వేణుగోపాల్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

Comments