ఒక్క రైతు కూడా ఈక్రాప్ నమోదులో మిస్ కాకూడదు.. జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు

 *ఒక్క రైతు కూడా  ఈక్రాప్  నమోదులో మిస్ కాకూడదు.. జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు


*


*పీవోఎల్ఆర్  మరియు  సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి*


*గ్రామ,వార్డ్ సచివాలయాల్లో తనిఖీలు నిర్వహించాలి*



 నంద్యాల, ఆగస్ట్ 31 (ప్రజా అమరావతి): ఈ క్రాప్ నమోదు చాలా ముఖ్యం...  ఈ క్రాప్ చేస్తేనే ప్రభుత్వం నుంచి అన్ని బెనిఫిట్స్ వస్తాయి.. ఆ బెనిఫిట్స్  రాలేదు అంటే మీదే బాధ్యత.. ఒక్క రైతు కూడా  ఈక్రాప్  నమోదులో మిస్ కాకూడదు అని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు.. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో మధ్యాహ్నం నిర్వహించిన  వ్యవసాయ, అనుబంధ శాఖల సమీక్షలో భాగంగా ఇప్పటివరకు

44403 హెక్టార్ల సాగైన విస్తీర్ణం లో 34358 హెక్టార్లలో  ఈ క్రాప్ చేశారని కలెక్టర్ తెలిపారు.. ఈ క్రాప్, ఈ కేవైసీ రిజిస్ట్రేషన్ ను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు..వంద శాతం కస్టమ్స్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు  చేయాలి.. అగ్రికల్చర్ సలహా మండలి సమావేశాలు రెగ్యులర్గా నిర్వహించాలి.సెరికల్చర్ పంట సాగు పెరిగేలా రైతులకు అవగాహన కల్పించాలి..హార్టికల్చర్, ఫిషరీస్ కు సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి పథకాలను అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు..


వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష కింద పీవోఎల్ఆర్  మరియు  సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు..పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన నంద్యాల మండలం బిల్లలాపురం ,  గోస్పాడు మండలం  ఎస్..నాగులాపురం లో కూడా వచ్చే నెల 7 వ  తేదీకి ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు..


గ్రామ,వార్డ్ సచివాలయాల్లో  మెరుగైన సేవలు అందించే విధంగా జిల్లా,డివిజన్,మండల స్థాయి అధికారులు అందరూ తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.. సచివాలయాల్లో సిబ్బంది హాజరు వంద శాతం ఉండాలన్నారు.. గ్రామ, వార్డ్ సచివాలయాల్లో అందించాల్సిన సేవలు మరియు స్పందన సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు..



మంగళవారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా కేటాయించిన లక్ష్యాన్ని రాత్రి లోపు వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


 ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 అంశాలపై నంద్యాల డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలుపై జాయింట్ కలెక్టర్ లతో కలిసి కలెక్టర్ లోతుగా సమీక్షించారు .


*

Comments