తిరుపతి నగరం ఆదర్శంగానే రాష్టమంతా చెత్త సేకరణ, యూజర్ చార్జీలు.

 తిరుపతి నగరం ఆదర్శంగానే రాష్టమంతా  చెత్త సేకరణ, యూజర్ చార్జీలు. 


ఆస్తి పన్ను విధానంలో మార్పు, ప్రజలకు భారం వుండదు- మంత్రి బొత్ససత్యనారాయణ.

         

తిరుపతి.(ప్రజా అమరావతి).. ప్రపంచం లోనే తిరుపతి నగరానికి ప్రత్యేక స్థానం వుందని,   స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులకు ముఖ్య మంత్రి  మరో రూ. 153 కోట్లు విడుదల  చేశారని, నగరాల అభివృద్దికి ,  పరిశుభ్రతకు  అధిక ప్రాధాన్యత నివ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర మునిసిపల్ శాఖామాత్యులు శ్రీ బొత్స  సత్యనారాయణ అన్నారు.  మంగళవారం మధ్యాహ్నం  స్థానిక నగర పాలక సంస్థ సమావేశ మందిరం లో తిరుపతి నగరలో జరిగుతున్న  అభివృద్ధి పనులపై   మంత్రి  మేయర్ శిరీషా, ఉప మేయర్లు భూమన అభినయ రెడ్డి, ముద్ర నారాయణ, కార్పొరేటర్లు, నగరపాలక కమిషనర్ గిరిశా ఐ.ఎ.ఎస్.తో  కలిసి సమీక్ష  నిర్వహించారు.  

      నగర పాలక సంస్థ కమీషనర్  మంత్రికి ముందుగా స్వాగతం పలికి ,  పవర్ పాయింట్  ప్రజెంటేషన్ ద్వారా తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను వివరించారు. తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు రూ. 684  కోట్లతో  67% టి. టి. డి.  నిధులు, 33% స్మార్ట్ సిటీ కార్పోరేషన్  నిదులతో  దాదాపు  80 పనులకు ప్రణాలికలు  గుర్తించామని తెలిపారు.  అందులో ప్రాధాన్యతా క్రమంగా  ప్రకాశం, పద్మావతి పార్కులు అభివృద్ధి చేశామని, వినాయక సాగర్, గొల్లవాని గుంట  లేక్ లు అభివృద్ధి చేస్తున్నామని  త్వరలో పూర్తి కానున్నాయని తెలిపారు.  స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ లో  ప్రధానమైనది  గరుడవారధి అని రాబోవు  సెప్టెంబర్ ఆఖరు నాటికి బస్టాండు నుండి కపిలతీర్థం, లీలామహల్  వద్ద వున్న ఫ్లై ఓవర్  ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.  తిరుపతిలో   రోజుకు  160 టన్నుల వరకు   తడి, పొడి చెత్త సేకరణ  జరుగుతున్నదని, వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.  సోలార్ రూఫ్ ఎనర్జీ , ఫ్లోటింగ్  సోలార్, వంటివి ఏర్పాటు వల్ల   విద్యుత్ చార్జీలు ఆదా చేస్తున్నామని తెలిపారు.  భూగర్భ విధ్యుత్  కేబులింగ్ గుర్తించిన 27 వీధుల్లో 60 : 40  నిష్పత్తి తో  ఎస్. పి. డి . సి. ఎల్. సహకారంతో  చేపడుతున్నదని వివరించారు.   తూకివాకం వద్ద ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించామని 25 ఎం. ఎల్. డి.  పరిశ్రమలకు నీటి  సరఫరా  చేయనున్నామని  అందుకు తగ్గ డిమాండ్  వుందని వివరించారు.   కొర్ల గుంట   హై స్కూల్  900 మంది చదివే  స్కూలు నిర్మాణం చేపట్టామని కోవిడ్ కు ముందు బడి పిల్లల కోసం  ఇ - హెల్త్  ప్రోగ్రాం  జరపాలని తెలిపారు.  మల్టీ లెవల్  కార్ పార్కింగ్, సిటి ఆపరేషన్ సెంటర్ , కార్పోరేషన్ నూతన భవన నిర్మాణం కు  ప్రతిపాదనలు పూర్తి అయ్యాయని వివరించారు.   

       మునిసిపల్ శాఖ  మంత్రి  మాట్లాడుతూ తిరుపతిలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరగడం సంతోషమని,  రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి  పై ప్రత్యెక దృష్టి రీత్యా స్మార్ట్ సిటీ కి మరో రూ. 153 కోట్లు అదనంగా  ఇచ్చారని తెలిపారు.  ఇంటింటి చెత్త సేకరణ ఇప్పటికే తిరుపతిలో జరుగుతున్నదని,  దీనిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర  మంతా  అమలు చేసి,   పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత  నివ్వనున్నామని తెలిపారు.  మేయర్ , కార్పొరేటర్లు, మునిసిపల్ అధికారులు  ఉదయం 6 గంటల  నుండి 8  గంటల వరకు నగరంలో పర్యటించి  పరిశుభ్రత పై దృష్టి పెట్టాలని అన్నారు.  కొత్త  ప్రాపర్టీ టాక్స్ విధానం లో 300 చదరపు అడుగుల ఇళ్ళ కు  కేవలం రూ. 350 /- నిర్ణయించామని, నగరంలో వున్న 50 నుండి 60 శాతం ప్రజలు ఇందులోకే  వస్తారని  అన్నారు.  ఇతర  రాష్ట్రాలు  తమిళనాడు, మహారాష్ట్ర లలో అమలు చేస్తున్న విధానం మేరకు   వారికన్నా తక్కువగా కాపిటల్ మీద గృహాలకు 0.10 నుండి  0.20  కమర్షియల్ భవనాలకు   0.20 నుండి 2.0 శాతంగా నిర్ణయించామని,  ప్రజలనుండి  వ్యతిరేకత లేదని ఈ విధానం వల్ల ప్రజలకెంతో మేలని, త్వరలో ప్రజలే అభినందిస్తారని  తెలిపారు. నూతన ట్యాక్స్ విధానం వల్ల ప్రతి  ఇంటిని డిజిటలైజ్ చేసి  ఆస్తి బదలాయింపులో వారికి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా   ఉండేలా రూపొందించామని అన్నారు.   గత మాసంలో  మునిసిపల్ సెక్రటరీ కుడా తిరుపతిలో పర్యటించారని , వారు అభినందించారని, ప్రస్తుతం ఇంకేమైనా   అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు కార్పోరేషన్  తీర్మానాలు పంపితే అమలు సిద్దంగా ఉన్నామని తెలిపారు.

Comments