బీసీలకు అత్యధిక ప్రాధాన్యత దక్కుతోంది'*
*రోడ్లు భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ*
అనంతపురము, ఆగస్టు 04 (ప్రజా అమరావతి);
జిల్లాలో అత్యధికంగా ఉన్న వెనకబడిన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వంలోనూ అత్యధిక ప్రాధాన్యత దక్కుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. 56 వెనకబడిన కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. బీసీ పిల్లలకు ఉన్నత విద్య, మంచి భవిష్యత్తు అందించేందుకు జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మౌలిక వసతులు ఏర్పాటు చేయదలిచామనన్నారు. ముఖ్యమంత్రి ఆశయ సాధన కోసం పటిష్టంగా పనిచేయడం మనందరి బాధ్యత అని తెలిపారు.
addComments
Post a Comment