విద్యుత్‌ సవరణ బిల్లుపై ప్రధానికి మమత లేఖ

 విద్యుత్‌ సవరణ బిల్లుపై ప్రధానికి మమత లేఖ



కోల్‌కతా (ప్రజా అమరావతి): కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లు-2020ను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. విద్యుత్‌ సవరణ బిల్లును ప్రజావ్యతిరేక బిల్లుగా అభివర్ణించారు. బిల్లును ఉపసంహరించుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.


గతేడాదే ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందని మమత గుర్తుచేశారు. ప్రజావ్యతిరేక విధానాలు కలిగిన ఈ బిల్లును చాలా మంది వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇదే అంశంపై గతేడాది జూన్‌ 12న సైతం లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు అదే బిల్లును మళ్లీ తీసుకురావడంపై మమత అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ హక్కులు కేంద్రానికి చేతికి కట్టబెట్టేలా ఉన్న ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. మరోవైపు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఇదివరకే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

Comments