రాష్ట్రానికి ఆదాయ వనరులపై సీఎం సమీక్ష



రాష్ట్రానికి ఆదాయ వనరులపై సీఎం సమీక్ష



అమరావతి (ప్రజా అమరావతి):

రాష్టానికి ఆదాయవనరులు అందించే శాఖలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

రావాల్సిన బకాయిలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం

ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం

ప్రతిఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులు వచ్చేలా చూడాలన్న సీఎం

జీఎస్టీ వసూళ్ల ద్వారా కూడా వచ్చే ఆదాయం వచ్చేలా చూసుకోవాలన్న సీఎం


రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపైన కూడా దృష్టిపెట్టాలన్న సీఎం

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందేలా చేయడం ఒక బాధ్యత అయితే, ప్రభుత్వానికి రావాల్సిన రెవిన్యూ వసూళ్లపైనా కూడా కలెక్టర్లు, జేసీలు దృష్టిపెట్టాలన్న సీఎం

కొత్త వ్యూహాలు, కొత్త మార్గాల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలన్న సీఎం, దీనికోసం వినూత్న సంస్కరణలను తీసుకురావాలని ఆదేశం.


ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్న సీఎం

మున్సిపల్, విద్యుత్‌ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండాలి:

సరైన కార్యాచరణ ద్వారా ప్రజలకు చక్కగా సేవలు అందుతాయి, ఆదాయాలు కూడా పెరుగుతాయి:


ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలి: సీఎం

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి?:

ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదు:

వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?!

అధికారులను ప్రశ్నించిన సీఎం

తప్పులకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్‌చేశామన్న అధికారులు


ఈస్థాయిలో తప్పులు జరుగుతుంటే.. ఎందుకు మన దృష్టికి రావడంలేదన్న సీఎం

ఎప్పటినుంచి, ఎన్నిరోజులనుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి?:

క్షేత్రస్థాయిలో వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయా?లేవా?ఎందుకు చూడ్డంలేదు?

క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్‌ సమాచారం తెప్పించుకోండి:

అవినీతిపై ఎవరికి కాల్‌చేయాలో ప్రతి ఆఫీసులోనూ ఫోన్‌నంబర్‌ ఉంచండి:

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నంబర్‌ఉండాలి:

కాల్‌సెంటర్‌కు వచ్చే కాల్స్‌మీద అధికారులు దృష్టిపెట్టండి:

కాల్‌సెంటర్‌మీద అధికారులు ఓనర్‌షిప్‌ తీసుకోండి:


అవినీతిని నిర్మూలించడానికి సరైన ఎస్‌ఓపీలను తీసుకురావాలని అధికారులకు సీఎం ఆదేశం

కేవలం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే కాదు, అన్ని కార్యాలయాల్లో చలానాల చెల్లింపు ప్రక్రియను పరిశీలన చేయాలని సీఎం ఆదేశం

సాఫ్ట్‌వేర్‌మొత్తాన్ని నిశితంగా పరిశీలన చేశామన్న ఆర్థికశాఖ అధికారులు

అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామన్న అధికారులు

మీ–సేవల్లో పరిస్థితులపైనా కూడా పరిశీలన చేయాలని సీఎం ఆదేశం


కనీసంగా వారం – పదిరోజులకు ఒకసారి అధికారులు సమావేశం కావాలని సీఎం ఆదేశం

ఆదాయవనరులు, పరిస్థితులపై సమీక్షచేయాలని సీఎం ఆదేశం

వివిధ రంగాల వారీగా సమీక్ష చేయాలని సీఎం ఆదేశం

ప్రతి సమావేశంలో ఒక రంగంపై సమీక్షచేయాలని సీఎం ఆదేశం

సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును తదుపరివారంలో పరిశీలన చేయాలన్న సీఎం


మద్యం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని అధికారులకు ఆదేశం

మద్యం అక్రమ రవాణా, కల్తీలపై ఉక్కుపాదం మోపండి:

మద్యం వినియోగాన్ని తగ్గించడానికి పలు చర్యలు తీసుకున్నాం:

దీనివల్ల సరిహద్దులనుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం వస్తున్న ఘటనలు చూస్తున్నాం:

ఇలాంటి వ్యవహారాలపై కచ్చితంగా ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశం:

Comments