గుంటూరు బి. టెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయి అరెస్ట్ - డీజీపీ గౌతమ్ సవాంగ్.

 డీజీపీ కార్యాలయం, మంగళగిరి (ప్రజా అమరావతి);


 గుంటూరు బి. టెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయి అరెస్ట్ - డీజీపీ గౌతమ్ సవాంగ్.

ఈ రోజు జరిగిన రమ్య హత్యా ఘటన అత్యంత దురదృష్టకరం.స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితున్ని గుర్తించడం జరిగింది .ఈ కేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారు.

హత్యకు పాల్పడిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందుతుణ్ణి కఠినంగా శిక్షిస్తాము.సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి.యువతులు, మహిళల పై దాడులకు యత్నిస్తే కఠిన శిక్షలు తప్పవు.

జరిగిన ప్రతి సంఘటనను రాజకీయ కోణంలో చూడవద్దని మనవి. సమాజంలో జరుగుతున్న వికృత పోకడలను సమిష్టిగా ఎదుర్కోవాలి.

ఘటన జరిగిన తక్షణం వేగంగా స్పందించి కేసు ను ఛేదించిన గుంటూరు అర్బన్ పోలీసులకు అభినందనలు. ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేసి నిందితుడికి సత్వరం కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశాలు ఇచ్చాం.

మహిళల రక్షణ మా ప్రథమ కర్తవ్యం. ఇందుకోసమై అహర్నిశలు శ్రమిస్తాం.

Comments