గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ వి మాధవ రెడ్డి


 *గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ వి మాధవ రెడ్డి* 


గుంటూరు (ప్రజా అమరావతి); ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్  అధికారిగా ఎస్ వి మాధవ్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈ స్ధానంలో పి.జాషువా బదిలీకాగా, మాధవ రెడ్డి గత రెండు సంవత్సరాలుగా రాజ్ భవన్ లో గౌరవ గవర్నర్ కు ఎయిడ్-డి-క్యాంప్ (ఎడిసి)గా ఉన్నారు. కడపకు చెందిన మాధవ రెడ్డి 2010 లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా గ్రూప్ 1 కు ఎంపికై పోలీసు శాఖలో వివిధ పదవులను సమర్ధ వంతంగా నిర్వహించి వన్నె తెచ్చారు. శిక్షణ అనంతరం తొలుత కర్నూలు జిల్లా ఆత్మకూరు, నిర్మల్ లలో డిఎస్పిగా పనిచేసి 2018లో అదనపు ఎస్పిగా పదోన్నతి పొందారు. తదుపరి కర్నూలు అదనపు ఎస్పి (పరిపాలన)గా పనిచేసి గుర్తింపు పొందారు. విజయవాడ ట్రాఫిక్ డిసిపిగా రహదారి భద్రతకు సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించారు. తన సర్వీసు కాలంలో నాలుగు సంవత్సరాల పాటు ఫారెస్టు రేంజ్ అధికారిగా పనిచేసి అటవీ చట్టాల పట్ల పూర్తి అవగాహన గడించారు. బాధ్యతలు తీసుకున్న తరుణంలో మాధవ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అక్రమాలకు తావు లేని విధంగా విజిలెన్స్ నిఘాను పటిష్ట పరుస్తామన్నారు.


SRI S.V.MADHAV REDDY, ADDL. SP JOINED AS NEW REGIONAL VIGILANCE & ENFORCEMENT OFFICER, GUNTUR


Sri S.V.Madhav Reddy is an officer of direct recruit Group-I batch of 2010 and he hails from Kadapa. Earlier he served as Forest Range Officer for 4 years.  He earlier worked as Deputy Superintendent of Police at Nirmal, Athmakur (Kurnool District), Technical services and promoted as Addl. SP in the year 2018. He worked as Addl. SP (Admn.), Kurnool and ADCP (Traffic) Vijayawada City. He earlier served as Aide–de-Camp (ADC) to Governor in Raj Bhavan, Andhra Pradesh, Vijayawada for two years. Government posted him as Regional Vigilance & Enforcement Officer, Guntur in place of Sri P.Joshua, Addl. SP who was transferred to Police Head Quarters, Mangalagiri.

Comments