శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి);  స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా ఆలయ పరిపాలానా కార్యాలయము, జమ్మిదొడ్డి నందు  నిర్వహించుచున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు  రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విచ్చేయగా  ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు  మరియు శ్రీయుత కార్యనిర్వహణాధికారి శ్రీమతి  డి.భ్రమరాంబ  మరియు పాలకమండలి సభ్యులు  స్వాగతం పలికారు. అనంతరం మంత్రివర్యులు SPF సిబ్బంది, హోంగార్డ్స్ మరియు ఆలయ రక్షణ సిబ్బంది వారి గౌరవ వందనం అందుకున్నారు. అనంతరం  మంత్రివర్యులు, ఆలయ చైర్మన్ , కార్యనిర్వహణాధికారి వారు మరియు పాలకమండలి సభ్యులు శ్రీ అమ్మవారి, భారతమాత, జాతిపిత మహాత్మాగాంధీ వారి చిత్ర పటాలకు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు మరియు అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూలు, పండ్లు సమర్పించి పూజలు నిర్వహించారు.  అనంతరము గౌరవ మంత్రివర్యులు flag hosting చేయగా,  చైర్మన్ , కార్యనిర్వహణాధికారి , పాలకమండలి సభ్యులు మరియు సిబ్బంది జాతీయ జెండా వందనము జేశారు.  తదనంతరము మంత్రివర్యులు, చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారి వారు స్వాతంత్ర దినోత్సవ విశిష్టత గురించి, స్వాతంత్రోద్యమ నాయకుల గొప్పదనం గురించి ప్రసంగించారు. అనంతరం చిన్నారులకు, SPF, సెక్యూరిటీ మరియు దేవస్థానము సిబ్బందికి ఆలయ పాలకమండలి చైర్మన్ గారు మరియు కార్యనిర్వహణాధికారి వారు  స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు వారు, సహాయ కార్యనిర్వహనాధికారులు, పర్యవేక్షకులు, పొలిసు సిబ్బంది వారు, ఇంజినీరింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, మరియు ఇతర దేవస్థాన సిబ్బంది వారు పాల్గొన్నారు.

Comments