అమరావతి (ప్రజా అమరావతి);
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆది నుంచి పేర్నాటి కుటుంబం ఎంతో చేసింది : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
పార్టీ కోసం కృషి చేసిన ఏ ఒక్కరినీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరచిపోరు అనడానికి నిదర్శనమే నామినేటెడ్ పదవుల ఎంపిక.
గూడూరు నియోజకవర్గం సహా నెల్లూరు జిల్లాలో వైసీపీని నిలబెట్టడంలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పాత్ర కీలకం*
వ్యవసాయ రంగంలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను వృద్ధిలోకి తీసుకురావాలంటూ చైర్ పర్సన్ పేర్నాటి హేమ సుశ్మిత ను అభినందించిన మంత్రి మేకపాటి.
పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి దంపతులను పూల గుచ్ఛాలందిస్తూ శుభాకాంక్షలు తెలియచేసి శాలువా కప్పి సత్కరించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి.
విజయవాడలోని ప్రసాదంపాడులో ఉన్న ఏపీ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి పేర్నాటి హేమ సుశ్మిత ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , నెల్లూరు జిల్లా వైసిపి అధ్యక్షులు , సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి, వైసిపి నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ శేఖర్ తదితరులు.
addComments
Post a Comment