*స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి*
*: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*
అనంతపురం, ఆగస్టు 14 (ప్రజా అమరావతి):
*ఆగస్టు 15వతేదీన ఆదివారం నిర్వహించే 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్లి తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పతాకావిష్కరణ చేస్తారన్నారు. వేడుకలకు హాజరయ్యే వారికి సిటింగ్ ఏర్పాట్లు చేయాలని, తాగునీరు, స్నాక్స్ అందించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులపై ప్రదర్శించే శకటాలు, స్టాల్స్, విద్యార్థులతో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, తదితర అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. వేడుకలకు హాజరయ్యే వారికి అవసరమైన మాస్కులు, శానిటైజర్ లు, ధర్మల్ స్కానర్ లు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలన్నారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ప్రధాన వేదికను, సిటింగ్ ఏర్పాట్లను, స్టాల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లు నిశాంత్ కుమార్, ఏ.సిరి, గంగాధర్ గౌడ్, ఆర్డీఓ మధుసూదన్, నగరపాలక సంస్థ కమిషనర్ పివివి ఎస్ మూర్తి, జిల్లా సిఈఓ భాస్కర్ రెడ్డి, మెప్మా పిడి రమణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరప్రసాద్, డిఎస్పి లు వీరరాఘవ రెడ్డి, శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.*
-
addComments
Post a Comment