ప్రభుత్వం నుంచి కియా ఇండియాకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం.

 ప్రభుత్వం నుంచి కియా ఇండియాకి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం*


*: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*


*: పెనుకొండ వద్ద కియా ఇండియా కంపెనీని పరిశీలించిన జిల్లా కలెక్టర్*


 పెనుగొండ, ఆగస్టు 05 (ప్రజా అమరావతి) : 

కియా ఇండియా కంపెనీకి ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. గురువారం పెనుకొండ మండలంలోని ఎర్రమంచి వద్దనున్న కియా ఇండియా కార్ల కంపెనీని పెనుకొండ సబ్ కలెక్టర్ నవీన్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కియా ఇండియాలో ప్రెస్ షాప్, బాడీ షాప్, పెయింట్ షాప్, ఇంజన్ షాప్, టెస్ట్ ట్రాక్ తదితర విభాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అంతకుముందు కియా కంపెనీ ప్రతినిధులు కియా ఇండియాలో కంపెనీ సేల్స్ వివరాలు, ఫ్యాక్టరీ నిర్మాణం, ట్రైనింగ్ సెంటర్ల వివరాలు, కియా కంపెనీ తరఫున ఈ ప్రాంతంలో చేస్తున్న సామాజిక కార్యక్రమాలు, కల్పిస్తున్న సదుపాయాలు, వసతులు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ కి తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కియా ఇండియా శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో కియా ఇండియా ఎండి కుక్ హ్యూన్ షిమ్, కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (సిఏఓ) కబ్ డంగ్ లీ, లీగల్ డిపార్ట్మెంట్ హెడ్ జూడ్ లీ, ప్రిన్సిపల్ అడ్వైజర్ డా. సోమశేఖర్ రెడ్డి, సిఎస్ఆర్ మేనేజర్ రవిశంకర్ రెడ్డి, పిఆర్ఓలు రాజశేఖర్, తేజస్వి, తహశీల్దార్ నాగరాజు, కియా సిబ్బంది పాల్గొన్నారు.

Comments