ప్రభుత్వ పాఠశాలల్లా ఉండాలని కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి - ఎంపీ గోరంట్ల మాధవ్.

 *ప్రభుత్వ పాఠశాలల్లా ఉండాలని కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి - ఎంపీ గోరంట్ల మాధవ్* 



అనంతపురము, ఆగస్టు 16 (ప్రజా అమరావతి);


కార్పొరేట్ స్కూళ్లలాగా ప్రభుత్వ స్కూళ్లు ఉండవు అని ప్రజలు ఒకప్పుడు భవించేవారని, మనబడి నాడు-నేడు పథకంతో కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు కూడా ప్రభుత్వ స్కూళ్లలా మారాలనుకునేవిధంగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. 


రాప్తాడు నియోజకవర్గంలోని కక్కలపల్లి కాలనీ అప్పర్ ప్రైమరీ స్కూలునందు నిర్వహించిన మనబడి నాడు-నేడు ఫేజ్-1 పాఠశాలలను జాతికి అంకితం చేయడం మరియు మనబడి నాడు-నేడు ఫేజ్-2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. 


కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో పేదల పిల్లలు కూడా ఇంజినీరింగ్ లాంటి పెద్ద చదువులు చదవాలని ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు చేశారని, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందుకు కొనసాగింపుగా ప్రాథమిక స్థాయి నుంచే అత్యున్నత విద్య ఉచితంగా అందాలని విద్యా రంగంలో అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు. 


ఏ ఒక్క విద్యార్థి చదువు ఆపకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని, తల్లిదండ్రులు సైతం ఎట్టి పరిస్థితులలోనూ, ఏ విద్యార్థినీ బడి మాన్పించొద్దని విజ్ఞప్తి చేశారు. 


 *కాసేపు టీచర్ గా ఎంపీ గోరంట్ల మాధవ్* 

కుక్కల పల్లి అప్పర్ ప్రైమరీ స్కూలు ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ గోరంట్ల మాధవ్ కాసేపు టీచర్ అవతారం ఎత్తారు. నూతనంగా నిర్మించిన డిజిటల్ క్లాస్ రూములో మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ కు సరదాగా డిజిటల్ స్క్రీన్ పై పాఠాలు చెప్పారు. 

............

 *సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురము వారిచే జారీ...*

Comments