*డిసెంబరు వరకూ తాడిపత్రి తాత్కాలిక ఆసుపత్రి సేవలు పొడిగింపు*
అనంతపురము, ఆగస్టు 05 (ప్రజా అమరావతి);
తాడిపత్రి పట్టణం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రి సేవలు ఈ ఏడాది డిసెంబరు వరకూ కొనసాగనున్నాయి. ఒప్పందం మేరకు రెండు నెలల కాలానికి జెర్మన్ హ్యాంగర్స్ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఆసుపత్రిని మరో ఐదునెలల పాటూ కొనసాగించేలా కాంట్రాక్టరుతో జిల్లా యంత్రాంగం ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం కాంట్రాక్టరుతో జేసీ నిశాంత్ కుమార్ సమావేశం నిర్వహించి మరో ఐదు నెలలు కాంట్రాక్టు పొడిగంపుకు అంగీకరించేలా చర్యలు తీసుకున్నారు.
addComments
Post a Comment