కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రమణ్యం.

 

 కారుమంచి (ప్రజా అమరావతి);


కుట్టుమిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రమణ్యం.



స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ ఆర్థిక సహకారంతో మా ఊరి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 60 మంది మహిళలకు కుట్టు మిషన్ పై శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టడం హర్షనీయమణి శాసన మండలి ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.ఈ నెల 8వ తేదీన ఉదయం 10 గంటలకు కారుమంచి గ్రామం లో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన విఠపు బాల సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుంటే వారిలో ఆత్మస్థైర్యం,ఆత్మవిశ్వాసం తో పాటు మహిళా సాధికారత సాధ్యమౌవుతుందని అన్నారు.ఈ సందర్భంగా స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ డైరెక్టర్ శివరామిరెడ్డి ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా 92 కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాలను ప్రారంభించి మహిళలకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామన్నారు. కారుమంచి గ్రామం లో రెండు కుట్టుమిషన్ కేంద్రాలను ప్రారంభించి   120 మందికి శిక్షణ ఇవ్వటం, శిక్షణతో పాటు 120 మందికి ఉచితంగా కుట్టుమిషన్లు అందించి స్వయం ఉపాధిని కల్పిస్తున్నామన్నారు.మా ఊరి రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వలంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ 120 మందికి ఆరు నెలల పాటు శిక్షణ అందించిన తర్వాత వారికి వివిధ కంపెనీలు, సంస్థలు, ప్రభుత్వాల నుండి ఆర్డర్లు తేప్పించి వారి ఆదాయం పెరిగేటట్లుగా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి, టంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి అజిత,గ్రామ సర్పంచ్ మన్నం శ్రీనివాస్,డ్వామా అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, కారుమంచి గ్రామ పంచాయతీ సెక్రెటరీ అంకయ్య తదితరులు పాల్గొన్నారు.


           

   

      

Comments