డంపింగ్‌యార్డులు కాదు..సంపద కేంద్రాలు*

 *డంపింగ్‌యార్డులు కాదు..సంపద కేంద్రాలు* . *ఎమ్మెల్యే అంబటి రాంబాబు.* 

 

సత్తెనపల్లి (ప్రజా అమరావతి) : ఘన వ్యర్దాల నిర్వహణా కేంద్రా(ఎస్‌డబ్ల్యుపిసి)లు అంటే చెత్త డంపింగ్‌యార్డులు కాదని, వృధానుండి సందప తయారు చేసే కేంద్రాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు  అన్నారు. సోమవారం మండలంలోని నందిగామ ఎస్‌డబ్ల్యుపిసిలో ఐటిసి ఆధ్వర్యంలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ఒక్క రోజు శిక్షణ, అవగాహన కార్యక్రమం జరిగింది. అచ్చంపేట మండల పంచాయితీ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంబటి గారు మాట్లాడుతూ పంచాయితీల నుండి వచ్చే ప్రతి వ్యర్ధమూ విలువైనదేనన్నారు. వ్యర్ధాలను వేరువేసి వాటి నుండి సేంద్రీయ ఎరువులు తయారు చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ఎరువు కాని  వ్యర్ధాలైన అట్టపెట్టెటు, సీసాలు, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఇతరాలను వేరు వేరుగా సేకరించి, నిల్వచేసిఅధిక మొత్తంగా విక్రయించడం ద్వారా కూడా ఆదాయం వస్తుందన్నారు. మొత్తం మీద ఘన వ్యర్ధాల నిర్వహణ పంచాయితీలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో, చిత్త శుద్ధితో నిర్వహిస్తే పల్లెల్లో పారిశుధ్యం , ఆహ్లాదం మెరుగుపడుతుందని, ఆదాయం వస్తుందని, సుమారు 10 మంది హరితరాయబారులకు వేతనాలు చెల్లించే పరిస్థితి వస్తుందన్నారు. వ్యర్దాలను నియంత్రించక పోతే భవిష్యత్‌ తరాలకు తీరని నష్ఠం చేకూర్చిన వారమవుతామని ఆయన తెలిపారు. శిక్షణలో పాల్గొన్న వారికి సేంద్రీయ ఎరువు తయారీ, వ్యర్ధాలను వేరు చేయడం , మొక్కల పెంపకంపై ప్రత్యక్షంగా వివరించారు. 


ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ రాయపాటి పురుషోత్తం ,పట్టణ కౌన్సిలర్‌ అచ్యుత శివప్రసాదరావు, అచ్చంపేట ఇఓపిఆర్‌డి పి శివరామయ్య , నాయకులు బాసు లింగారెడ్డి , మర్రి సుబ్బారెడ్డి , పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసరావు , ఐటిసి రిసోర్స్‌ పర్సన్స్‌ బుల్లయ్య గారు,కృష్ణ , కోటేశ్వరరావు  తదితరులున్నారు.