*అమ్మపాలు అమృతం…!*
*NRI ఆస్పత్రి గర్భిణీ స్త్రీల వైద్య విభాగాధిపతి కె.ప్రభాదేవి.*
చినకాకాని (ప్రజా అమరావతి); అమ్మపాలు అమృతమని, తల్లిపాలు బిడ్డకి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా తల్లీ బిడ్డకి మధ్య చక్కని ప్రేమ బంధాన్ని పెంపొందిస్తుందని ఎన్నారై ఆసుపత్రి గర్భిణీ స్ర్తీ ల వైద్య విభాగాధిపతి డాక్టర్ కె. ప్రభాదేవి అన్నారు. చినకాకాని ఎన్నారై వైద్యశాలలో బుధవారం తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ప్రభాదేవి మాట్లాడుతూ... తల్లి పాలివ్వడం ద్వారా బిడ్డ మానసిక ఆరోగ్యం చక్కగా వృద్ధి చెందుతుందన్నారు. తల్లిపాలకి మించిన పాలు ఏవీ లేవని, చంటి బిడ్డలో రోగనిరోధక శక్తిని పెంపొందించి, సాధారణ వ్యాధులు నుండి రక్షణ కలిగిస్తాయని అన్నారు. తల్లి పాలు వల్ల బిడ్డకి సంరక్షణ కలగడమే కాకుండా తల్లికి కూడా మంచి ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. బిడ్డకు 6 మాసాలు నిండే వరకు తల్లిపాలే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ బి. విజయలక్ష్మి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మలాజ్యోతి, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment