ఆదర్శ మూర్తి ఆంధ్ర కేసరి టంగుటూరి
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి
విజయనగాం, ఆగష్టు 23 (ప్రజా అమరావతి): బారిస్టర్ చదువును అభ్యసించిన అత్యంత మేధావి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులని, నైతిక విలువలను ప్రాణంగా భావించే ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా సోమవారం కలక్టరేట్ ఆడిటోరియం లో ఆయన చిత్ర పటానికి పూల మాలలను వేసి ఘనంగా నివాళు లర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్య మంత్రిగా టంగుటూరి చరిత్ర లో నిలిచారని, టంగుటూరి అత్మాభిమానం కలవారని, అవిశ్వాస తీర్మాణానికి నైతిక బాధ్యత వచించి పదవీ త్యాగం చేసిన గొప్ప వ్యక్తని పేర్కొన్నారు. నమ్మిన దానిని ఆచరించడం లో, నైతికంగా వ్యవహరించడం లో ఆయనకు ఆయనే చాటియని అన్నారు. వారి బాటలో అందరం నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో సంయుక్త కలెక్టర్లు డా. జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, జే. వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జారి: సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విజయనగరం.
addComments
Post a Comment