పేదల పిల్లలకు ఉచితంగా పెద్ద చదువులు చెప్పాలన్నదే జగనన్న ఆశయం

 పేదల పిల్లలకు ఉచితంగా పెద్ద చదువులు చెప్పాలన్నదే జగనన్న ఆశయం'* 


*'నాడు-నేడు తో ప్రభుత్వ బడుల స్వరూపమే మారిపోయింది'* 


*మనబడి నాడు-నేడు ఫేజ్-1 పాఠశాలలను జాతికి అంకితం చేయడం మరియు మనబడి నాడు-నేడు ఫేజ్-2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ* 


అనంతపురము, ఆగస్టు 16 (ప్రజా అమరావతి);


రాష్ట్రంలో పేదల పిల్లలకు ఉచితంగా పెద్ద పెద్ద చదువులు చెప్పాలన్న ఆశయంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనబడి నాడు-నేడు పథకాన్ని తీసుకొచ్చారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ పేర్కొన్నారు. 


సోమవారం ఉదయం మంత్రి శంకరనారాయణ రాప్తాడు నియోజకవర్గంలోని కక్కలపల్లి కాలనీ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూలు నందు నిర్వహించిన మనబడి నాడు-నేడు ఫేజ్-1 పాఠశాలలను జాతికి అంకితం చేయడం మరియు మనబడి నాడు-నేడు ఫేజ్-2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మనబడి నాడు-నేడు పేజ్ 1 లో  ఒక కోటి, 20 లక్షల రూపాయల నిధులతోపూర్తయిన కక్కలపల్లి కాలనీ అప్పర్ ప్రైమరీ పాఠశాలను మంత్రి ప్రారంభించారు. పాఠశాలలో నూతనంగా కల్పించిన నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, ఫాన్స్ మరియు ట్యూబ్ లైట్స్ తో కూడిన విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి, విద్యార్థులకు మరియు సిబ్బందికి ఫర్నిచర్ సౌకర్యం, పాఠశాల మొత్తానికి పెయింటింగ్ చేయడం, పెద్ద మరియు చిన్న తరహ మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డుల ఏర్పాటు, ప్రహరీ గోడల నిర్మాణం, వంటగదుల ఏర్పాటు, ఇంగ్లీష్ లాబ్స్ ఏర్పాటు వంటి పది రకాల వసతులను పరీక్షించారు.  డిజిటల్ క్లాస్ రూమ్ లను ప్రారంభించారు.  ఆట స్థలాన్ని ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు.  అక్కడ జరిగిన సమావేశములో

హాజరైన స్కూలు పిల్లలు, తల్లిదండ్రులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన పిల్లలకు ఎలాంటి విద్య దక్కుతుందో అలాంటి విద్యను పేద ప్రజల పిల్లలకు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. 


ఉచితంగా విద్యతో పాటు పిల్లలను కేవలం బడికి పంపితే చాలు తల్లులకు అమ్మఒడి ద్వారా ఏటా రూ. 15,000 అందించడం, బడికొచ్చిన పిల్లలకు ఉచితంగా 9 రకాల వస్తువులతో విద్యాకానుక ద్వారా కిట్టు అందించడం జరుగుతోందన్నారు. కూలీనాలీ చేసుకునే తల్లిందండ్రుల బాధ తెలసిన ముఖ్యమంత్రి   మధ్యాహ్నం భోజనం కేవలం పోషక విలువలు ఉంటే మాత్రమే సరిపోదని, ప్రత్యేకంగా  మెనూ తయారు చేయించి రోజుకో వంటకం వడ్డిస్తున్నారన్నారు. 


పేదల పిల్లలు చిన్నప్పటినుంచే ఇంగ్లీషు మీడియంలో చదివితే పై చదువుల సమయంలో ఉద్యోగాల వేటలో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్న ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి ఇంగ్లీషు విద్యను ప్రవేశపెట్టారన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లల ఇంగ్లీషు ఉచ్చారణ మెరుగు పరిచేందుకు ఇంగ్లీషు ల్యాబులు ఏర్పాటు చేశారన్నారు. 

పుస్తకాలలో చదువుకున్న అంశాలను ద్వారా కళ్లకు కట్టినట్టు చూపించడం ద్వారా పిల్లలు తొందరగా నేర్చుకోవడంతో పాటు నేర్చుకున్న అంశాలను కలకాలం గుర్తుంచుకుంటారనే ఉద్దేశ్యంతో డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 


విద్యార్థుల కంటి చూపు బాగుండాలని కంటివెలుగు ద్వారా ఉచిత కంటి పరీక్షలు, ఉచిత కళ్ళద్దాలు, ఉచిత శస్త్ర చికిత్సలు కూడా నిర్వహిస్తున్నారన్నారు. 


ఇవేగాక గతంలో కేవలం పాలపొడి బడులుగా పిలుచుకునే అంగన్ వాడీ బడులను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి మూడేళ్ల వయసున్నప్పటినుంచే పేదల పిల్లలకు కూడా చదువులు చెప్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. 


ఇన్ని వసతులు ఏర్పాటు చేయడంతో గతంలో 250 మంది పిల్లలు కూడా లేని కక్కలపల్లి  కాలనీ పాఠశాలలో నేడు 450 మందికి పైగా విద్యార్థులున్నారన్నారు. 

జిల్లాలో 406678  మంది విద్యార్ధుల‌కు విద్యాకానుక‌

రూ.67.8 కోట్ల విలువైన జ‌గ‌న‌న్న విద్యాకానుక కిట్లు పంపిణీ  నేడు అన్ని నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యే సారధ్యంలో అందజేస్తున్నారు.

1294 ప్ర‌భుత్వ యాజ‌మాన్య‌ పాఠ‌శాల‌ల్లోని విద్యార్ధుల‌కు ప్ర‌యోజ‌నం

ఒక్కో విద్యార్ధికి రూ.1545 విలువ  కిట్టు  పంపిణీ చేయుచున్నాము

తొలి విడ‌త నాడు - నేడు ప‌నులు చేప‌ట్టిన స్కూళ్ల ప్రారంభం నేడే

రూ. 399.49 కోట్ల‌తో జిల్లాలో తొలివిడ‌త పాఠ‌శాల‌ల్లో నాడు - నేడు ప‌నులు

1294 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో స‌మ‌కూరిన అద‌న‌పు వ వసతులు. ఈరోజు నుండి రెండవ దశ లో 1615 చల్ల ను ఎందుకు చేయడం జరిగిందని. పది రకాల మౌలిక వసతులు తో పాటు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

భవిష్యత్తులో రకరకాల పథకాల ద్వారా స్కూళ్లలో అభివృద్ధి చేసిన మౌలిక వసతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మీద ఉంటుందని గుర్తు చేశారు. ముఖ్యంగా మంచి నీటి ప్లాంటు, డిజిటల్ క్లాస్ రూమ్ వంటి వసతులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకోవాలన్నారు. 


ప్రసంగం అనంతరం మంత్రి శంకర నారాయణ, స్కూలు విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు. 

 ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఆహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, ఉర్దూ అకాడెమీ చైర్మన్ నదీమ్ అహ్మద్ తదితరులు, జాయింట్ కలెక్టర్ ఏ.సిరి ,  జిల్లావిద్యాశాఖ అధికారి రంగస్వామి, సమగ్ర శిక్ష అధికారి  విద్యాసాగర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సమగ్ర శిక్ష  ఎస్ శివకుమార్,  మండల విద్యాశాఖ అధికారి వెంకటస్వామి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ శ్రీమతి గీత, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసింహులు, సర్పంచ్ తేజస్విని, మత్స్యశాఖ కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments